శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్‌లపై , ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పణలో తల్లాడ సాయికృష్ణ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ హీరో శ్రీకాంత్ రీసెంట్‌గా విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “మ్యాజిక్ మూవ్‌మెంట్స్” టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది, టైటిల్‌కు తగ్గట్టుగానే వీరికి కూడా మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నానని హీరో శ్రీకాంత్ అన్నారు. అలాగే సినిమా మంచి విజయం సాధించి చిత్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని, చిత్ర బృందంలోని అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.


