శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ చిత్రంలో మహిమ నంబియార్ హీరోయిన్ నటించింది. ఈ సినిమాకు జానకీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ.. వసూళ్లపరంగా రాణించింది. రెండు రోజుల్లోనే దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అడవిలో షూటింగ్ సందర్భంగా నటుడు శ్రీకాంత్ కింద పడబోయాడు. వెంటనే అక్కడున్న వారంతా శ్రీకాంత్‌ను పట్టుకుని ప్రమాదం నుంచి కాపాడారు. సినిమా రిలీజ్ అయ్యాక నటులు పడే బాధలు ఇలా ఉంటాయని కోన వెంకట్ ట్వీట్ చేశారు.
కోన వెంకట్ తన ట్వీట్‌లో రాస్తూ..'ప్రాణాలు పణంగా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు. సినిమాయే ప్రాణంగా మేమంతా బతుకుతాం.. ఆ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేసి బ్లాక్బస్టర్ చేస్తే అదో పునర్జన్మ లా అనిపిస్తుంది.. కామ్రేడ్ కళ్యాణ్ కోసం ఈ సీన్ 2025 ఫిబ్రవరి లో మంగళూరు అడవిలో తీసినప్పుడు ఈ సంఘటన జరిగింది.. ఈ విజయం తో మా శ్రీకాంత్‌కు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు' అని పోస్ట్ చేశారు.
ప్రాణాలు పణం గా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు.. సినిమాయే ప్రాణంగా మేమంతా బతుకుతాం.. ఆ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేసి బ్లాక్బస్టర్ చేస్తే అదో పునర్జన్మ లా అనిపిస్తుంది.. “కామ్రేడ్ కళ్యాణ్” కోసం ఈ సీన్ 2025 ఫిబ్రవరి లో మంగళూరు అడవిలో తీసినప్పుడు ఈ సంఘటన జరిగింది.. ఈ విజయం తో మా శ్రీకాంత్ కు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు 🤗 @sreevishnuoffl @siyengarks Love you Audience ❤️ #ComedyKalyanBB
— KONA VENKAT (@konavenkat99) October 11, 2026


