నాకు దేవుడు ఇచ్చిన వరం ఈ సినిమా: ఆనంది | Garividi Lakshmi Movie Trailer Release Event Highlights | Sakshi
Sakshi News home page

నాకు దేవుడు ఇచ్చిన వరం ఈ సినిమా: ఆనంది

Oct 7 2026 12:17 PM | Updated on Oct 7 2026 12:24 PM

Garividi Lakshmi Movie Trailer Release Event Highlights

‘‘గరివిడి లక్ష్మి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో చేసిన కళా ప్రదర్శన చాలా ఆకట్టుకుంది. ఈ పాటలు వింటుంటే నా బాల్యం గుర్తుకొచ్చింది. ఈ చిత్రానికి మంచి పేరొస్తుందని నమ్ముతున్నాను’’ అని అడివి శేష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. 

ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హీరో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీష్‌ శంకర్, మారుతి అతిథులుగా హాజరయ్యారు.  ‘‘ఈ సినిమా నాకు దేవుడు ఇచ్చిన వరం’’ అన్నారు ఆనంది.   ‘‘గరివిడి లక్ష్మి’ మాకు ప్రత్యేకమైన సినిమా’’ అని చెప్పారు కృతీ ప్రసాద్‌. ‘‘గరివిడి లక్ష్మి’ పాత్రకు ఆనంది సరైన ఎంపిక అనిపించింది’’ అని చె΄్పారు విశ్వప్రసాద్‌. 

‘‘మా గరివిడి లక్ష్మి మీతో (ప్రేక్షకులు) పాడిస్తుంది... ఆడిస్తుంది... నవ్విస్తుంది... కన్నీళ్లు పెట్టిస్తుంది’’ అని చె΄్పారు గౌరీ నాయుడు. ‘‘ఇందులో స్పెషల్‌ రోల్‌ చేశాను’’ అన్నారు రాగ్‌ మయూర్‌. సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్, నటుడు వీకే నరేష్‌ తదితరులు ΄ాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement