నటిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా తన ప్రయాణిన్ని కొనసాగిస్తున్న పరుల్ గులాటి ఓ ఇంటర్య్వూలో ఆసక్తి కరమైన విషయాలను పంచుకుంది. ‘ గోవా అంటే నాకు ఎంతో ఇష్టం. ముంబైలో కంటే గోవాలోనే ప్రశాంతత దొరుకుతుంది. ఆలోచించడానికి, కొత్త విషయాలను సృష్టించడానికి , జీవితాన్ని ఆస్వాదించడానికి గోవా అవకాశం కల్పిస్తుంది. ముంబైలో ఎంజాయ్ చేయడం ఇష్టం కానీ విశ్రాంతి పొందాలంటే గోవానే సరైన ప్రదేశం’ అని తెలిపింది.
నటన కోసం మాట్లాడుతూ.. ‘ సవాళ్లతో కూడిన పాత్రలు చేయాలని ఉంది. ప్రముఖ కవయిత్రి అమృతా ప్రీతమ్‌కు సంబంధించిన పాత్రలు ఏవైనా ఉంటే నటించాలని ఉంది. ఆమె కవిత్వాలు చిన్నప్పుడు నుంచి చదువుతూ పెరిగాను’ అని వెల్లడించింది. సోషల్ మీడియాలో తనను మాల్కిన్ అని పిలుస్తారని చెప్పిన పారుల్.. ఫాలోవర్లు అవకాశాలు తీసుకురావచ్చేమో కానీ దీర్ఘకాలం కెరీర్‌లో నిలబెట్టిదే మాత్రం ప్రతిభేనని స్పష్టం చేసింది. వ్యాపార రంగంలోకి రావడం వల్ల జీవితంలోని ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పారుల్ తెలిపింది.


