Cannes 2025: నిజమైన జుట్టుతో ఫ్రాక్.. స్పెషల్ అట్రాక్షన్‌గా పారుల్
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫ్రాన్స్‌లో జరిగే కాన్స్ చిత్రోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ వేడుకల్లో పాల్గొనే తారలు ప్రత్యేక దుస్తుల్లో ప్రత్యక్షమై కనువిందు చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఇప్పటికే పలువురు నటీమణులు అదిరేటి డ్రెస్సుల్లో ఆకట్టుకోగా... తాజాగా మరికొందరు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. భారతదేశం నుంచి ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న అనుష్కా సేన్ పర్పుల్ ఫ్రాక్‌లో కలర్ఫుల్గా కనిపించారు. ‘దేవోం కే దేవ్.... మహాదేవ్, బాలవీర్, ఝాన్సీ కీ రాణి’ తదితర షోస్‌లో నటించిన అనుష్కా సేన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ‘నమస్తే’ అంటూ, అక్కడున్న వారికి అభివాదం చేయడం దేశం పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో రూపొందిన ‘తన్వీ ది గ్రేట్’లో నటించిన శుభాంగి దత్ మల్లెపువ్వుల తాజాదనాన్ని గుర్తు చేస్తూ తెల్లటి గౌనులో ఫ్రెష్‌గా కనిపించారు. అలాగే పలు పంజాబీ చిత్రాల్లోనూ, ఒక తెలుగు చిత్రం (‘నీ జత లేక’), పలు హిందీ సీరియల్స్, టీవీ షోస్‌లో నటించిన పారుల్ గులాటి నిజమైన జుట్టుతో తయారు చేసిన ఫ్రాక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ న్యాన్సీ త్యాగి స్వయంగా తానే తయారు చేసుకున్న గౌనులో, మ్యూజిక్ సెన్సేషన్ ఆస్టా గిల్ బంగారు రంగు గౌనులో మెరిసిపోయారు. ఇంకా హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలి, ఎమ్మా స్టోన్ తదితరులు రెడ్ కార్పెట్ పై ఐ ఫీస్ట్‌గా నిలిచారు.అమెరికన్ కాంటెంపరరీ వెస్ట్రన్ ఫిల్మ్ ‘ఎడింగ్టన్’ స్పెషల్ ప్రీమియర్ కాన్స్‌లో ఓ హైలైట్‌గా నిలిచింది. ఆరి ఆస్టర్ డైరెక్షన్లో జోక్విన్ ఫీనిక్స్ (‘జోకర్’ సినిమా ఫేమ్), పెడ్రో ఫాస్కల్, ల్యూక్ గ్రిమ్స్, డీర్ర్డే ఓ కానల్, మైఖేల్ వార్డ్, ఆస్టిన్ బట్లర్, ఎమ్మా స్టోన్ ప్రధాన ΄ాత్రలు ΄ోషించారు. ఈ ‘ఎడింగ్టన్’ టీమ్ రెడ్ కార్సెట్ వాక్ చేసినప్పుడు ఓ గమ్మతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఈగ ఎమ్మా స్టోన్ చూట్టూ తిరిగింది. ఆ ఈగను చూసి, ఎమ్మో స్టోన్ కొన్ని సరదా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఆమె పక్కనే ఉన్న పెడ్రో ΄ాస్కల్–ఆస్టిన్ బట్లర్లు ఆ ఈగను తోలడం వంటివి వీక్షకులను అలరించాయి. అలాగే ఈ ప్రీమియర్ తర్వాత ఈ సినిమాకు ఐదు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ మూవీ జూలై 18న అమెరికాలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీమియర్‌కు ఏంజెలినా జోలీ హాజరవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.