breaking news
kiara adavani
-
‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్‌కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోయిన్ అంటే గ్లామర్ అనుకుంటివా..ఫైర్.. ‘తగ్గేదే లే’
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.... మరొకరు ఖడ్గం అందుకున్నారు... ఇంకొకరు చేతికి దొరికిన ఆయుధం తీసుకున్నారు... చూడ్డానికి సున్నితంగా కనిపించే ఈ భామలందరూ ఇలా ‘వెపన్స్’ పట్టుకున్నది విలన్లను రఫ్ఫాడించడానికే. ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ హీరోయిన్లు కొందరు ‘యిన్ యాక్షన్’ అంటూ యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగల్లా కనిపించే ఈ తారలు మెరుపు వేగంతో ఫైట్స్ చేయడానికి ‘సై’ అన్నారు. ఆ పోరాటాల్లోకి వెళదాం. శివానీ రిటర్న్స్ శివానీ శివాజీ రాయ్‌ని తొలిసారి ప్రేక్షకులు ‘మర్దానీ’ (2014) చిత్రంలో చూశారు. ఈ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను రాణీ ముఖర్జీ అద్భుతంగా చేశారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘మర్దానీ 2’ (2019)లోనూ పోలీస్‌గా విజృంభించారు రాణి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. మరోసారి శివానీ శివాజీ రాయ్‌గా ‘మర్దానీ 3’లో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తొలి భాగం ‘మర్దానీ’ని, రెండో భాగాన్ని గోపీ పుదిరన్ దర్శకత్వంలో నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ మూడో భాగం ‘మర్దానీ 3’ని అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి, మలి భాగాల్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ 3’లోనూ ఆ పాత్ర చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్‌లో రాణి చేసిన యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పదేళ్ల క్రితం ఫస్ట్ పార్ట్‌లో ఎంత ఎనర్జిటిక్‌గా కనిపించిందో ఇప్పుడూ అలానే కనిపిస్తోందనే కితాబులు ఆమెకు దక్కాయి. ఇక సినిమాలో ఏ రేంజ్లో విజృంభించారో చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఆగాల్సిందే. ‘‘చెడుపై పోరాటం చేసే శివానీ శివాజీ రాయ్‌ని తెరపైకి తీసుకురావడానికి హోలీ కన్నా మంచి సమయం ఏం ఉంటుంది. 2026 మార్చి 4న హోలీ. ఓ వారం ముందే ఫిబ్రవరి 27న మా శివానీ థియేటర్స్‌కి వస్తుంది’’ అని యశ్ రాజ్ సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. వారియర్ క్వీన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగలా కనిపించే దీపికా పదుకోన్ మెరుపు వేగంగా ఫైట్ చేయడం కూడా చూశాం. అందుకు ఉదాహరణగా ఈ మధ్య వచ్చిన చిత్రాలు ‘పఠాన్, ఫైటర్, సింగమ్ ఎగైన్’లను చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌత్ సినిమాలో తన యాక్షన్‌ని చూపించడానికి రెడీ అయ్యారు దీపికా పదుకోన్. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ΄పాన్ ఇండియన్ మూవీ ‘ఎఎ22 ఎ6’ (వర్కింగ్ టైటిల్)లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె వారియర్ క్వీన్‌గా కనిపించనున్నారు. ఈ పోరాట యోధురాలికి సంబంధించిన లుక్‌ని ఇటీవల విడుదల చేయగా, దీపిక ఆ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’లో దీపికా పదుకోన్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ‘ఎఎ22 ఎ6’లో పూర్తి స్థాయి కథానాయికగా వారియర్ క్వీన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని సమాచారం. షాపింగ్ మాల్లో ఫైట్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మాస్ హీరోలిద్దరూ సిల్వర్ స్క్రీన్‌పై ΄పోటా పోటీగా చేసిన వార్ని చూడ్డానికి ఇద్దరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా... ఈ చిత్రంలో మరో లీడ్ రోల్లో నటించిన కియారా అద్వానీ కూడా ఫైట్ చేశారట. నిజానికి ‘వార్ 2’ టీజర్లో కియారా ఎల్లో కలర్ బికినీలో గ్లామరస్‌గా కనిపించి, హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇంత హాట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఇదే సినిమాలో ఓ షాపింగ్ మాల్లో డైనమిక్ ఫైట్‌లోనూ కుర్ర కారు గుండె లబ్ డబ్ పెంచనున్నారు. ఈ ఒక్క ఫైట్ మాత్రమే కాదు... మరికొన్ని ఫైట్ సీన్స్ కూడా చేశారట. ‘ఎట్రాక్షన్ మాత్రమే కాదు యాక్షన్’ కూడా అన్నమాట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. లేడీ డాన్ కృతీ సనన్ వెండితెరపై తొలిసారి ఓ రేంజ్లో ఫైట్స్‌లో విజృంభించిన చిత్రం ‘గణపత్’ (2023). ఈ చిత్రంలో చేసిన జస్సీ సింగ్ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఓ కళ అయిన ‘నన్చాకు’ని నేర్చుకున్నారు. ఇప్పుడు రెండేళ్లకు మరోసారి ఫైట్స్‌లో స్పెషల్‌గా ట్రైనప్ అవుతారట. కృతీ సనన్‌కి వచ్చిన ఆఫర్‌లాంటిది మరి. ఈ బ్యూటీ లేడీ డాన్‌గా కనిపించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్యారెక్టర్ కోసమే శిక్షణ తీసుకోనున్నారట. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా రూపొందనున్న ‘డాన్ 3’లో ఈసారి రణ్వీర్ సింగ్ డాన్‌గా కనిపించనున్నారు. లేడీ డాన్‌గా కియారా అద్వానీని ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత కియారా ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ కావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి ఈ పాత్రకు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కృతీ సనన్ పేరు కూడా ఉంది. ఫైనల్లీ కృతీ సనన్‌నే ఫిక్స్ చేశారట చిత్ర దర్శక–నిర్మాత ఫర్హాన్ అక్తర్. ఈ ఏడాదే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహిళా గూఢచారుల కథ ఇద్దరు మహిళా గూఢచారులు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ప్రమాదకరమైన మిషన్లు ఎదుర్కొంటారు. తగ్గేదే లే అంటూ సాహసాలు చేస్తారు. ఈ ఇద్దరూ చేసిన సాహసాలేంటి? అనేది ‘ఆల్ఫా’ చిత్రంలో చూడాల్సిందే. ఆలియా భట్, శార్వరీ ఏజెంట్స్‌గా నటిస్తున్న చిత్రం ఇది. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఆఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన గూఢచారుల చిత్రాల్లో హీరోలు లీడ్ రోల్స్ చేశారు. అయితే ఈ స్పై యూనివర్స్‌లో మహిళా గూఢచారులే ప్రధాన పాత్రలుగా వైఆర్ఆఫ్ నిర్మిస్తున్న తొలి చిత్రం కావడంతో ‘ఆల్ఫా’పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఆలియా, శార్వరీ రిస్కీ స్టంట్స్ చేశారట. ఈ సినిమా షూటింగ్ ఆరంభించే ముందు ఇద్దరు నాయికలకు ఫైట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ, ఆలియా పాల్గొనగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశం చిత్రీకరించారని, ఇంకా బోలెడన్ని రిస్కీ ఫైట్స్ ఉన్నాయని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో ఆలియా భట్ గురువు ΄ాత్రలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కనిపించనున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 25న విడుదల కానుంది. పగ తీర్చుకోవడానికి... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించారు త్రిప్తీ దిమ్రి. తనలో మంచి గ్లామరస్ నటి ఉందనే విషయాన్ని నిరూపించుకున్నారామె. మళ్లీ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారీ బ్యూటీ. అయితే ఈ చిత్రంలో త్రిప్తి పాత్ర ఏంటనే వివరాలు బయటకు రాలేదు. కాగా తనలో మంచి యాక్షన్ హీరోయిన్ ఉన్న విషయాన్ని నిరూపించుకోవడానికి రెడీ అయిపోయారు ఈ హీరోయిన్. ఓ హిందీ చిత్రంలో త్రిప్తి యాక్షన్ రోల్ చేస్తున్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ‘కమీనే, హైదర్, రంగూన్’ వంటి విశ్లేషకుల ప్రశంసలూ దక్కించుకున్న చిత్రాల తర్వాత మళ్లీ షాహిద్ కపూర్–విశాల్ భరద్వాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ ఫుల్ ΄్యాక్డ్ యాక్షన్ మూవీలో త్రిప్తీ దిమ్రి పగ తీర్చుకునే ΄ాత్రలో కనిపిస్తారట. ఎవరిపై పగ? ఏంటా కథ అనేది తెలియాల్సి ఉంది. రివెంజ్ తీర్చుకునే క్రమంలో ΄ోరాటాలు చేస్తారట. ఈ ΄ాత్ర కోసం త్రిప్తి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారని సమాచారం. ఇక ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట షాహిద్ కపూర్. ఈ ΄ాత్ర రిస్కీ ఫైట్స్ చేస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ఫైట్స్ కోసం షాహిద్, త్రిప్తి ఒకేసారి శిక్షణ తీసుకున్నారని బాలీవుడ్ ఖబర్. ఈ ఏడాది డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. యాక్షన్‌తో ఇంట్రడక్షన్ సిల్వర్ స్క్రీన్‌పై ఫస్ట్ టైమ్ కనిపించడం కనిపించడమే ఓ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. తండ్రి కాంబినేషన్లో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ డాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రధానాంశం గురు–శిష్యుల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. తండ్రీ కూతురు షారుక్–సుహానా వెండితెరపై గురు–శిష్యులుగా కనిపిస్తారట. గురువు క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని భోగట్టా. అంటే... షారుక్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని స్పష్టం అవుతోంది. నైపుణ్యం గల హంతుకుడిగా ఈ గురువు తన శిష్యురాలికి ΄ోరాటాల్లో శిక్షణ ఇస్తాడట. ఇద్దరూ కలిసి అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ని ఛేదిస్తారట. ఈ యాక్షన్ రోల్ కోసం సుహానా ఫైట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... యాక్షన్ రోల్‌తో ఇంట్రడ్యూస్ కానున్న సుహానా ఖాన్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూడాలి.ఇంకా సోనాక్షీ సిన్హా, తాప్సీ తదితర తారల డైరీలో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. హీరోయిన్లంటే గ్లామర్ మాత్రమే కాదు... చాన్స్ వస్తే తమలోని ఫైర్‌ని బయటికి తీస్తామని యాక్షన్ మూవీస్ ద్వారా నిరూపించుకుంటుంటారు. అయితే ఒకేసారి ఈ తారలందరూ యాక్షన్ రోల్స్ చేయడం మంచి పరిణామం. కథానాయికల ప్రాధాన్యత పెరుగుతోందనడానికి ఇదో నిదర్శనం. -
చాలా భయపడ్డా.. పారిపోవాలనిపించింది: షారుక్ ఖాన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్‌కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్స్టైల్’ను థీమ్‌గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్‌కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు. ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు. -
రష్మిక క్యూట్ పోజులు.. జలపాతం వద్ద మాళవిక అందాలు
➡️ ప్రెగ్నెన్సీ ప్రకటించిన హీరోయిన్ కియారా అద్వానీ➡️ ప్రకృతి అందాల మధ్య మాళవిక మోహన్➡️ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్➡️ డ్రాగన్ సినిమా జ్ఞాపకాల్లో కయాడు లోహర్➡️ సీరియస్ లుక్‌లో రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
బ్లాక్ లుక్.. కియారా అద్వానీ జిగేల్! (ఫొటోలు)
-
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఛేంజర్‌నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, నాజర్ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్ ఛేంజర్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్(Shankar) అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్. అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్ చరణ్(Ram Charan) నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్ నందన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటిషీయన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్లో కనిపిస్తారు. జయరాం, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్‌నెస్ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్ ఛేంజర్ కథేంటి? ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్ ఛేంజర్ సినిమాకు ఎక్స్‌లో మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. చరణ్ నటన అదిరిపోయింది కానీ.. శంకర్ మేకింగ్ బాగోలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్ బాగుంది. దోప్ సాంగ్ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్ సీన్అదిరిపోయింది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్ మరోసారి తన టేకింగ్ పవర్‌ని చూపించాడు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025#GameChanger#GameChangerReview First Half:Very Entertaining, fast paced screenplay by @shankarshanmugh sir. Superb first half. #SJSuryah and #RamCharan𓃵mass acting 🔥🔥🔥@MusicThaman Music is top work and #Dhop song is Hollywood level making #BlockbusterGameChanger— Mr.Professor (@EpicViralHub_) January 10, 2025SPOILER ALERT !! ⚠️⚠️IPS, IASInterval bang kosam CMMalli ventane IASImmediate ga Chief Electoral OfficerMalli climax bang kosam CMNeeku ishtam ochinattu thippav atu itu @shankarshanmugh 🤦🏻#GameChanger— . (@UrsPG) January 10, 2025Shankar’s corruption theme is outdated and he should choose a different script. Else its a Game Over for him.#GameChanger— CB (@cinema_babu) January 10, 2025భారతీయుడు శంకర్ చివరికి ఎన్. శంకర్ అయిపోతాడు అనుకోలేదు 🙏Outdated & Cringe #GameChanger— 🅰️⛓️ (@UaReports689gm1) January 10, 2025#RamCharan #GameChanger•More of a message-driven movie.•Set against a political backdrop.•Unbelievable solutions in the narrative.•Commercial elements are relatively less.•Every actor excelled in their roles, which is a very, very big plus for the movie!— USAnINDIA (@USAnINDIA) January 10, 2025 -
Game Changer: కాఫీ కప్పులోనే ఊరి సెట్.. ఆ పాటకే 30 కోట్లు
గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ లిరికల్ వీడియో వచ్చినప్పుడు చూసి నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ రీసెంట్గా పూర్తి పాటను చూసి షాకయ్యాను. దాదాపు రూ.25-30 కోట్లు ఖర్చు పెట్టి ఈ పాటను తెరకెక్కించారు. కాఫీ కప్పులోనే ఊరి సెట్ వచ్చేలా శంకర్ ప్లాన్ చేశారు. థియేటర్లో ఆ పాట బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఆ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోయాయనిపిస్తుంది. అంతలా శంకర్ గారు మ్యాజిక్ చేశారు’ అన్నారు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించగా, ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్(Game Changer) కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.→ ఈ చిత్రంలో రామ్ చరణ్(Ram Charan) డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.→ నటుడిగా ఓ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకత్వ విభాగంలో వేలు పెట్టను. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. శంకర్(Shankar) గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.→ ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.→ గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ).→ గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.→ నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే..ఖషి2 తెరకెక్కిస్తాను. -
గేమ్ ఛేంజర్ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?
రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కేవలం వారం రోజుల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం సాయంత్రం 5.04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రీలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా పూర్తి రన్‌టైమ్ ఎంతో సెన్సార్ ప్రకటించింది.గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రన్‌టైమ్ 2:45 గంటలు ఉందని సెన్సార్ బోర్డ్ తెలిపింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం సాయంత్రం 2.43 నిమిషాల నిడివితో ట్రైలర్ విడుదల కానుంది. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. 'వినయ విధేయ రామ'చిత్రం తర్వాత రామ్ చరణ్– కియారా అద్వానీ రెండోసారి జోడీగా నటించారు. రెమ్యునరేషన్ తగ్గించుకున్న చరణ్.. కారణం ఇదేనా..?ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా విడుదల కానుంది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమా కోసం చరణ్ తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. చరణ్ రూ. 60 కోట్లు, శంకర్ 30 కోట్లు మాత్రమే తమ రెమ్యూనరేషన్లుగా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే, రామ్ చరణ్ ఏ సినిమాకు అయిన ఓకే చెబితే.. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే తన రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది. ఆయన అడ్వాన్సులు వంటివి తీసుకోరట. అదే ఆయనకు ఇప్పుడు మైనస్ అయిందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా 2024లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ కారణం వల్ల ముందుగా అనుకున్న తన రెమ్యునరేషన్‌ను చరణ్ తగ్గించుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం అవుతుంది. -
మహేష్ వాయిస్ నాకు నచ్చలేదు...
-
గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎన్నాళ్లకెన్నాళ్లకు...?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకు ముహుర్తం పెట్టి దాదాపు మూడేళ్లు అవుతుంది. షూటింగ్ మొదలై రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఓ మోషన్ పోస్టర్, పాట మినహా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్..‘ఒకే ఒక్క అప్డేట్’ ఇవ్వండి అంటూ చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వినాయక చవితి రోజున అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించడంతో.. ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. చెప్పినట్లుగానే ఈ రోజు ఓ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెలలలోనే విడుదల కాబోతుంది. ఇదే మేకర్స్ ఇచ్చిన తాజా అప్డేట్. ఆ పాట ఏ తేదిన రిలీజ్ చేస్తారో కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని పక్కకు పెడితే కొత్తగా విడుదల చేసిన పోస్టర్లో మాత్రం రామ్ చరణ్ అదిరిపోయాడు. క్లాస్ దుస్తులు , తలకు ఎర్ర తువాల చుట్టి స్టైలీష్‌గా కనిపించాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. pic.twitter.com/vkewh4bimj— Shankar Shanmugham (@shankarshanmugh) September 7, 2024 -
యశ్ ‘ టాక్సిక్ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార!
తమిళసినిమా: కేజీఎఫ్ చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు నటించే చిత్రం అంటే ఆ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకూడదు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి. నటుడు యష్ అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారనిపిస్తోంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తరువాత ఈయన టాక్సిక్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. ముఖ్యంగా బీబీసీ సీరీస్ పిక్కీ బ్లైండర్స్ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ నాయకిగా నటించనున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యష్‌కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది. -
డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ!
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. Welcome to the Don universe @advani_kiara #Don3@RanveerOfficial @ritesh_sid @PushkarGayatri @J10Kassim @roo_cha @vishalrr @excelmovies @chouhanmanoj82 #Olly pic.twitter.com/T5xGupgHiF — Farhan Akhtar (@FarOutAkhtar) February 20, 2024 -
చీరలో సదా, కియరా సోకులు.. మీనాక్షి నవ్వులు
► పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతుంది సదా ►బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కొత్తింట్లోకి అడుగుపెట్టింది. గృహప్రవేశం అంటూ ట్రెడిషనల్ డ్రెస్‌లో ఫోటో దిగి అభిమానులతో పంచుకుంది ►చల్లని గాలిలో గరం గరం చాయ్ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని షేర్ చేసుకుంది మీనాక్షి చౌదరి. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
కియారా దంపతులకు RC15 సర్ప్రైజ్.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హొత్రతో ఆమె ఈనెల7న ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైసల్మైర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా రామ్‌చరణ్ సరసన ‘RC15’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితేపెళ్లి కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన కియారాకు మూవీ టీం క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది. సిద్-కియారాలకు వెడ్డింగ్ విషెస్ చెబుతూ మూవీ టీం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. దీనిపై స్పందించిన కియారా ఈ సర్ప్రూజ్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life! Wishing you a lifetime of happiness, love and light❤ Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI — Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023 -
ఒక్కటైన కియారా- సిద్ధార్థ్ జంట.. ఫోటోలు వైరల్
-
సీక్రెట్ డేటింగ్.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ ఇంకా బయటకు రాలేదు. అయితే వీరి పెళ్లి తంతుకు హాజరయ్యేందుకు వెళ్లిన పలువురు బాలీవుడ్ సినీ నటీనటులు కియార-సిద్ధార్థ్ వెడ్డింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నటి ప్రీతి జింటా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ వైబ్స్ అంటూ సోమవారం తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కాగా కొంతకాలంగా వీరిద్దరు ప్రేమ ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీర్దిదరూ ఎప్పుడూ తమ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. తామిద్దరం స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్న ఈజంట పెళ్లి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచింది. వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చదవండి: పెళ్లి చేసుకున్న ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! సుమంత్‌తో విడాకుల తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? -
RC15: శంకర్ భారీ స్కెచ్.. ఒక్క పాటకే అన్ని కోట్లా?
డైరెక్టర్ శంకర్-మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక శంకర్-రామ్ చరణ్ కాంబో అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మూవీ నిర్మాణంలో కూడా శంకర్ ఎక్కడ రాజీ పడడనే విషయం తెలిసిందే. ముఖ్యం పాటలను ఆయన చాలా రిచ్‌గా ప్లాన్ చేస్తాడు. అలాగే ఈ సినిమాలోనూ చరణ్-కియారాల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్‌ను భారీగా ప్లాన్ చేశాడట శంకర్. చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి ఈ పాట కోసం ఏకంగా ఆయన రూ. 23 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఫిలిం ధునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈపాటలో రామ్ చరణ్-కియారాలతో కలిసి 1000మందికి పైగా డ్యాన్సర్స్ స్టెప్పులు వేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతున్నది క్లారిటీ. దీనిపై స్పష్టత రావాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మొదలైప్పటి నుంచి ఆర్సీ 15 సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఒక్క ఫస్ట్‌లుక్ పోస్టర్‌కే దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టాడని, అలాగే ఈ సన్నివేశం కోసం రూ. 10 కోట్లతో ఓ సెట్ వేసినట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! -
రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్..
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే!..ఈ ఇద్దరూ సమయం దొరికితే చాలు ఒక్కచోట చేరిపోతారు.అలా వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ లవ్ బర్డ్స్ పెళ్లిపీటలు ఎక్కనున్నారని బీటౌన్ టాక్. 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చకచకా పూర్తి చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్ వేడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారట. కేవలం బంధువులు, సన్నిహితులు సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. అయితే ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సిద్దార్థ్.. తాను ఎంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నా ఎలాగైనా అది బయటికొస్తుందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. -
సిద్దార్థ్‌తో బ్రేకప్ రూమర్స్, తొలిసారి స్పందించిన కియారా
Kiara Advani Respond On Break Up With Siddharth Malhotra: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్‌టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. వీరి బ్రేకప్‌పై బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. కానీ, గొడవల వల్ల కాదని, షూటింగ్లో బిజీ ఉండటం వల్ల అంటూ అందరిని ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్ ఫ్రెండ్స్. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ ఇదిలా ఉంటే తాజాగా వీరి బ్రేకప్ వార్తలపై స్పందించి కియారా అద్వాని. కియారా తాజాగా నటించిన ‘భూల్ భులయ్యా-2’ ట్రైలర్ ఈవెంట్లో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె ‘నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరిని మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇది విని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య ఏం జరగలేదని, వీరి బ్రేకప్ వార్తల్లో నిజం లేదంటూ అభిప్రాయ పడుతున్నారు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత ఇదిలా ఉంటే సిద్ధార్థ్, కియారాలు వారి రిలేషన్‌పై ఇంతవరకు స్పందించలేదు. కానీ ముంబై రోడ్లలో జంటగా చక్కర్లు కొడుతూ విందులు, వినోదాలకు కలిసి వెళుతుంటారు. అంతేకాదు కియారా పలుమార్లు సిద్ధార్థ్ ఇంటికి వెళుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో విరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ పుకార్లు గుప్పుమన్నాయి. 2021లో వీరిద్దరు జంటగా నటించిన ‘షేర్షా’ చిత్రంలో కియారా, సిద్ధార్థ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా పండటంతో ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి. కాగా భూల్ భూలయ్యా 2 చిత్రంలో కియారా, కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా నటిస్తోంది. ఇందులో సీనియర్ నటి టబు కీ రోల్ పోషిస్తోంది. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RC15: మూవీ టైటిల్ ఖరారు.. చరణ్ బర్త్‌డే రోజునే అనౌన్స్మెంట్?
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్’ రాజు ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇటీవల పుణేలో తొలి షెడ్యూల్ పూర్తవగా ప్రస్తుతం రాజమండ్రిలో RC15 టీం సందడి చేస్తోంది. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ ఖరారైందని, రామ్ చరణ్ బర్త్‌డే రోజున ఈ అప్డేట్ ఇవ్వనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో లో రామ్ చరణ్ సివిల్ సర్విసెస్ అధికారిగ కనిపించనున్నట్లు ముదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రభాస్-అనుష్క పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి! ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున రిలీజ్ చేసిన ఈ తొలి పోస్టర్లో రామ్ చరణ్, కియార అద్వాని, డైరెక్టర్ శంకర్, దిల్ రాజు, శ్రీకాంత్‌తో సహా మిగతా క్రూడ్ సూటు బూటు ధరించి ఆఫిసర్స్ లుక్‌లో కనిపించారు. ఈ క్రమంలో ‘సర్కారోడు’ టైటిల్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని, దీంతో ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. దీనిపై చర్చలు జరిపి రామ్ చరణ్ బర్త్‌డే రోజు టైటిల్ అనౌన్స్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడిగా కియారా అద్వాని నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది: బాలీవుడ్ హీరో
సాక్షి, ముంబై: కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర పోషించిన నటుడు షేర్షా మూవీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు సిద్ధార్థ్ సోషల్ మీడియాద్వారా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) రేటింగ్‌లో 8.8 తో టాప్‌లో నించింది. 'నంబర్ 1 రేటింగ్ హిందీ మూవీ' అంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. (Shershaah Movie: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్) అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర చేయడం, మూవీ విజయవంతంకావడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇది తనకు చాలా ప్రత్యేకం, ఎప్పటికీ గుర్తుండిపోయేదని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అటు కియారా అద్వానీ కూడా సినిమా సక్సెస్ కావడంపై చాలా ఎమోషనల్‌గా ఉంది. దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. సినిమా తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్లాగా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెకు బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. తాజాగా మూవీలో విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని వీక్షిస్తూ కియారా భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అయింది. (Shershaah: వెక్కి వెక్కి ఏడ్చిన కియారా అద్వానీ వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్
సాక్షి,ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాల కాలంలో విడుదలైన ఈ మూవీలో ముఖ్యమైన సన్నివేశాలు, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర నటన, ఉద్వేగ సన్నిశాల డైలాగ్స్‌తో యువ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జయహో అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ‘‘ఒక్కసారి సైనికుడిగా ఉంటే ఇక జీవితాతం అతడు సైనికుడే’’ ‘‘అయితే జెండా చేత బూని వస్తా.. లేదంటే త్రివర్ణ పతాకం చుట్టుకొని వస్తా.. కచ్చితంగా తిరిగి రావడం మాత్రం ఖాయం.’’ సహచరుడిని కోల్పోయిన తరుణంలో నీళ్లు నిండిన కళ్లతో కెప్టెన్ బాత్రా తన తోటి జవాన్లతో ఇలా అంటాడు.. "ఏ వార్ బడీ కుత్తీ ఛీజ్ హై యార్" యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటూ నినదిస్తాడు. చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్న విక్రమ్ భాత్రా యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటాడు. సాధారణ పౌరుడి జీవితంలో అనుకున్నది సాధించడం వేరు...కానీ ఒక సైనికుడిగా దేశ రక్షణ పోరాటంలో నిర్దేశిత మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్వేగపూరిత సన్నిశంలో ఈ డైలాగ్ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. దీంతోపాటు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందన్నట్టుగా కెప్టెన్ విక్రమ్ బాత్రా అతని స్నేహితురాలు డింపుల్ చీమా అందించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్నికూడా షేర్షా బాగా హైలైట్ చేసింది. వీరి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడ్డ సన్నివేశం, ఆర్మీలో చేరాలనే బాత్రా కల కోసం అందించిన ప్రోత్సాహంతోపాటు, ఆమె తెగువకు, ప్రేమకు సెల్యూట్ చేస్తుందీ సినిమా. నరనరాన దేశభక్తిని నింపుకున్న వీరజవాన్ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర ఫుల్మార్క్లు కొట్టేయగా, విక్రమ్ ప్రేయసి డింపుల్ క్యారెక్టర్లో కియారా అద్వానీ అటు అందంతో ఆకట్టుకోవడంతోపాటు ఇటు తెగువ, ధైర్యం ఉన్న మహిళగా అభినయంలోనూ జీవించింది. అలాగే కెప్టెన్ సంజీవ్‌గా శివ్ పండిట్, మేజర్ అజయ్ సింగ్‌గా నికితిన్ ధీర్, విక్రమ్ స్నేహితుడు సన్నీ పాత్రలో సాహిల్ వైద్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. -
SSMB28: స్టోరీ అవుట్, ఆ సినిమాలో మహేశ్ పాత్రే టైటిల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎస్ఎస్ఎమ్బీ28’ చిత్రం నుంచి తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఇటీవల వీరిద్దరి కాంబోపై ఇటీవల ఆఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎదోఒక అప్డేట్ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పక్కప్లాన్‌తో చేస్తున్న ఈ మూవీ స్టోరీలైన్, టైటిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో హరిక హాసిని బ్యానర్లో చినబాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పార్థు’ అనే టైటిల్‌ను ఖారారు చేశారని, ఇందులో మహేశ్ మధ్య తరగతి కటుంబానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడనే వార్త కూడా వైరల్ అవుతోంది. ఇందులో హీరో తండ్రి ఓ డాన్ అని, అది తెలియక హీరో కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేయడం జరుగుతుందట. ఇక ఆ తర్వాత అతడే తన తండ్రి అని తెలిశాక హీరో ఎలాంటి స్టేప్ తీసుకుంటానేది ఈ కథ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా అతడు మూవీ మహేశ్ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే. డాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీసుకోవాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. ఈ తండ్రీకొడుకుల వార్‌ను ఆసక్తికరంగా మలిచేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ఇందులో మహేశ్ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. చదవండి: SSMB28: మరోసారి మహేశ్‌తో రొమాన్స్ చేయనున్న ఆ హీరోయిన్ SSMB28: వచ్చే ఏడాది సమ్మర్‌కు రానున్న క్రేజీ కాంబో -
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్
కియరా అద్వానీ ‘లస్ట్ స్టోరీస్’లో కోరికలున్న టీచర్‌గా చేసింది. ‘స్పెర్మ్’ తారుమారు కాగా మరొకరి బిడ్డను గర్భాన మోసే తల్లిగా ‘గుడ్ న్యూస్’లో నటించింది. కబీర్ సింగ్‌లో పెళ్లికి ముందే బోయ్ ఫ్రెండ్‌తో సామీప్యానికి వెరవని ప్రియురాలిగా నటించింది. అదే కియరా అద్వానీ ‘భరత్ అనే నేను’లో తెలుగువారికి నచ్చినట్టుగా ఎంతో అందంగా కనిపించింది. ఆమెకు అందం ఉంది. ఆమెలో పాత్ర కోసం చేయదగ్గ సాహసం ఉంది. కియరా ఇప్పుడు బాలీవుడ్‌ను తన చుట్టూ తిప్పుకుంటోంది. 2018 కియారా అద్వానీ కెరీర్లో ముఖ్యమైన సంవత్సరం. ఆ సంవత్సరంలోనే ఆమె రెండు సినిమాలు రిలీజయ్యాయి. థియేటర్లలో ‘భరత్ అనే నేను’. నెట్‌ఫ్లిక్స్‌లో ‘లస్ట్ స్టోరీస్’. భరత్ అనే నేనులో కియరా ముఖ్యమంత్రి అయిన మహేశ్‌బాబుకు గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపిస్తుంది. చక్కటి ఆహార్యంలో ముగ్ధ రూపంలో మహేశ్‌ను ఆమె ఆకట్టుకుంటుంది. కాని ‘లస్ట్ సోరీస్’లో ఆమె కథ వేరు. ఆమెకు ఆ సినిమాలో భర్త ఉంటాడు. అతనితో సాన్నిహిత్యానికి వంక ఉండదు. కాని అది ఆమెకు సరిపోదు. అలా సరిపోక పోవడం మన సంస్కృతిలో నిషిద్ధ చర్చాంశం. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది అసలు ఉన్నట్టుగా తెలియనట్టే నటిస్తుంటారు. ఆ సినిమాలో కియరా పాత్ర తనకు కోరిక ఉన్నట్టు గ్రహిస్తుంది. భర్త ఉన్నా భర్త ఇవ్వదగినది ఇస్తూ ఉన్నా చాలనంత కోరిక ఉన్నట్టు గ్రహిస్తుంది. కోరిక ఉన్నట్టు గ్రహించడం ఏం తప్పు. అడ్డదారులు తొక్కకుండా దానిని ఆమె వ్యక్తపరచడమే ఆ సినిమాలో తప్పు అవుతుంది. అత్తగారు ఆమెను అనాదరిస్తుంది. భర్త దూరమవుతాడు. కాని భర్త ఆమెను పూర్తిగా అర్థం చేసుకొని చివరకు చేరువ అవుతాడు. కియరా అద్వానీ ఆ పాత్రను నిర్వహించిన తీరును అందరూ మెచ్చుకున్నారు. ఒకవైపు భరత్ అనే నేను పెద్ద హిట్ అయ్యింది. లస్ట్ స్టోరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ అయ్యింది. కియరా అద్వానీ తిరుగులేని స్టార్‌గా అవతరించింది. కియరా అద్వానీ డబ్బున్న కుటుంబంలో (1992) జన్మించింది. ఆమె తండ్రి సింధి. తల్లిది ముస్లిం–ఐరిష్ జాతీయతలు ఉన్న కుటుంబ నేపథ్యం. తల్లికి యాడ్స్ చేయడం సరదాగా ఉండేది. కియరా చిన్నప్పుడే తల్లితో కలిసి విప్రో బేబీ ప్రాడక్ట్స్ యాడ్‌లో నటించింది. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఉండే ఇంటికి పెద్ద కూతురుగా పుట్టిన కియరాను తండ్రి ఏ మాత్రం గ్లామర్ ఫీల్డ్‌లో రాకూడదని కోరుకున్నాడు. కాని కియరాకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఇది ఎంత తండ్రికి చెప్పినా వినేవాడు కాదు. కాని చిత్రంగా ఆయన మనసు మారింది. దానికి కారణం రాజు హిర్వాణి తీసిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా. పిల్లలను వారికి ఏది నచ్చితే అది చేయనివ్వాలి, దేనిలో వారు రాణిస్తారో ఆ రంగంలో ప్రవేశపెట్టాలి అని ఆ సినిమా చెబుతుంది. అది చూసిన కియరా తండ్రి ఆమెకు సినిమాల్లో వెళ్లమని పర్మిషన్ ఇచ్చాడు. అయితే నిర్ణయాలు తీసుకోవడంతో పని అయిపోదు. దానికి పని చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో అంటే ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. కియరా అద్వానీ తల్లి జెనివైవ్ జాఫ్రీ సల్మాన్ ఖాన్‌కు స్కూల్ ఫ్రెండ్. కియరా చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌కు తెలుసు. కియరా సినిమాల్లోకి వద్దామని నిశ్చయించుకున్నాక ఆమెను పేరు మార్చుకోమని సల్మాన్ ఖానే సలహా ఇచ్చాడు. ఎందుకంటే కియరా అసలు పేరు ఆలియా అద్వానీ. ఆలియా భట్ అప్పటికే సినిమాల్లో ప్రశేశిస్తూ ఉండటంతో కియరాను కొత్తపేరు పెట్టుకోమని చెప్పాడు. ఒక సినిమాలో ప్రియాంక చోప్రా పాత్రకు కియరా అనే పేరు ఉంటుంది. కియరా కూడా అదే పేరు పెట్టుకుని కియరా అద్వానీ అయ్యింది. సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ పరిచయం అవకాశాలు కల్పించగలవుగానీ సక్సెస్‌ను గ్యారంటీ చేయలేవు. కియరా అద్వానీ ‘ఫగ్లీ’ (2014) అనే కామెడీ సినిమాతో ఆరంగేట్రమ్ చేసింది. ఇంతటితో తాను సినిమాల్లో దూసుకెళతానని కలలు కంది కాని ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమా రంగంలో ఫ్లాప్ అనేది అన్నీ దారులను మూసివేసే తాళం కప్పలాంటిది. కియరా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అవార్డు ఫంక్షన్స్‌కు వెళితే చివర కూచోబెట్టేవారు. అవకాశాలు కోరితే ముఖం తిప్పుకునేవారు. తల్లిదండ్రులు ఆమెను చూచోబెట్టి ఒక్కమాట చెప్పారు. ‘అసలు నీ సినిమా రిలీజయ్యిందని మర్చిపో. తిరిగి మొదటి నుంచి మొదలెట్టు’ అని. ‘ఇందులో కొనసాగాలంటే మళ్లీ ప్రయత్నించాల్సిందే’ అన్నారు. కియరా ప్రయత్నించింది. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాలో కియరాకు ధోని భార్య పాత్ర లభించింది. అయితే అది చిన్నది. ఆ తర్వాత ‘మెషీన్’ అనే సినిమాలో సోలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. సరిగ్గా అప్పుడు కరణ్ జొహర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది కియారాకు. ఆ సినిమాయే ‘లస్ట్ స్టోరీస్’. స్త్రీల లైంగికతను చర్చించే ఈ సినిమాలో కియారాది ఒక స్కూల్ టీచర్ పాత్ర. అందులో ఆమె ఒక సన్నివేశంలో వైబ్రేటర్ వాడినట్టుగా కనిపించాల్సి ఉంటుంది. అయినా కియరా ఆ పాత్ర చేసింది. కుటుంబం, నేపథ్యం, ఇన్హిబిషన్స్ ఇవన్నీ పక్కనపెట్టి కియరా నటించడం పాత్రను పాత్రలా చూడటం అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో తెలుగు నుంచి ‘భరత్ అనే నేను’ భారీ హిట్ కావడంతో కియరా ఇరుభుజాలకు రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆమె ఎగరడం మొదలుపెట్టింది. తెలుగులో భారీ హిట్ అయిన అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అవుతున్నప్పుడు హీరోయిన్ పాత్రకు కియరాను దర్శకుడు సందీప్ రెడ్డి ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని రిలీజ్ అయ్యాక తేలింది. అందులో షాహిద్ కపూర్ వంటి సీనియర్ నటుడికి సరిజోడుగా కియరా నటించగలిగింది. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో కియరా టాప్ క్లాస్ హీరోయిన్గా అవతరించింది. ఆమె తాజా సినిమా ‘గుడ్ న్యూస్’ నూరు కోట్ల కలెక్షన్‌ను దాటింది. కియారా ఇప్పుడు అక్షయ్ కుమార్ పక్కన, యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ పక్కన రెండు వేరు వేరు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకదానికి ‘కాంచన’ సిరీస్ ఆధారం. దర్శకుడు లారెన్స్. తెలుగు సినిమా వల్ల కూడా ఎదిగిన కియరా ఇప్పుడు తెలుగుకు అందనంత ఎత్తుకు చేరుకుంది. ఆమె తిరిగి తెలుగులో నటించాలనంటే అంత అందమైన పాత్ర, అంత బోల్డ్ కేరెక్టర్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సినిమా వస్తుందనే ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
స్పెషల్ గెస్ట్
అజర్ బైజాన్ వెళ్లారు చిరంజీవి. అదేంటీ ‘సైరా’ సినిమా కోసం ఆయన జార్జియాలో కదా ఉండాలి? అంటే అది నిజమే. కానీ చిరంజీవి ఇంకా జార్జియా సెట్లో జాయిన్ అవ్వలేదట. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ అజర్బైజాన్లో జరుగుతోంది. ముఖ్యంగా రామ్‌చరణ్, వివేక్ ఒబెరాయ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌ను విజిట్ చేశారు చిరంజీవి. సినిమా ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారట. అంటే తనయుడి సినిమా లొకేషన్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లారన్న మాట. దాదాపు 25 రోజుల పాటు అజర్ బైజాన్‌లో షూటింగ్ చేసి, యూనిట్ ఇండియా చేరుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. -
అంచనాలను మించేలా...
‘రంగస్థలం’ వంటి భారీ హిట్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం షెడ్యూల్ అజర్ బైజాన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డీవీవీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. రామ్‌చరణ్– బోయపాటి కాంబినేషన్ అనగానే మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో తెలిసిందే. వారి అంచనాలను మించేలా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశాం. మంగళవారం నుంచి అజర్బైజాన్లో భారీ ఖర్చుతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. 25 రోజల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్ సహా ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. ఈ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. రీసెంట్గా తెరకెక్కించిన పండగ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్ ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుందని సమాచారం. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: కల్యాణ్. -
హార్డ్ వర్క్... స్మాల్ పార్టీ
బ్యాంకాక్‌కు బై బై చెప్పారు రామ్‌చరణ్ అండ్ టీమ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ టీమ్ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీటైంది. ‘‘షెడ్యూల్ పూర్తి చేశాం. ఇప్పుడు స్మాల్ పార్టీ చేసుకుంటున్నాం. ఇంత హార్డ్ వర్క్ చేశాక ఆ మాత్రం పార్టీ చేసుకోవడానికి మేం అర్హులమే’’ అని కియారా పేర్కొన్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో స్నేహ, ప్రశాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ఆలోచనట. -
రెండు పాటలకు ఆరు కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు లాంటి ఘన విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ మరోసారి హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో కీలక సన్నివేశాలు అసెంబ్లీ నేపథ్యంలో తెరకెక్కించారు. అందుకోసం 2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేసినట్టుగా తెలిపారు. ఈ సెట్లో పలు సన్నివేశాలతో పాటు ‘హామీ ఇస్తున్నా’ పాటకు సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన ‘వచ్చాడయ్యో సామీ’ పాట కోసమే నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్ సరసన కిరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. -
నినదిస్తా నిత్యం జనహితం
‘‘పాలించే ప్రభువును కానని, సేవించే బంటును నేనని.. అధికారం అర్థం ఇదని తెలిసేలా.. చేస్తా నా పని’’ అని ప్రజాప్రతినిధిగా హామీ ఇస్తున్నాడు భరత్ రామ్. అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి అని ప్రశ్నిస్తున్నాడు. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇందులో కియారాఅద్వాని కథానాయిక. సీయం భరత్ రామ్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లనుంది చిత్రబృందం. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.‘‘విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం.. దిస్ ఈజ్ మీ’’ అంటూ సాగే ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ ఓత్ అండ్ విజన్ ఆఫ్ భరత్‌కు మంచి స్పందన లభించింది. ఆదివారం రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌కు ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్. రామజోగయ్యశాస్త్రి రాసిన అద్భుతమైన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ వీనుల విందైన సంగీతం తోడైంది. డేవిడ్ సిమన్ అంతే అద్భుతంగా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
క్లైమాక్స్ ఖతమ్!
ఖతమ్ చేశారు... విలన్స్‌ను కుమ్మేసి, వారి చెడు ఆలోచనలను ఖతమ్ చేశారు హీరో మహేశ్‌బాబు. బ్యాలెన్స్ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో కియారా అద్వాని కథానాయిక. పబ్లిక్ మీటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫైట్ సీన్స్‌తో సహా ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌ను కంప్లీట్ చేశారు. బ్యాలెన్స్ ఉన్న కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ నెల 8 వరకు కొనసాగనుందట. ఈ చిత్రంలో సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
కేరళ టు కారైకుడి
సంఘ విద్రోహక శక్తుల భరతం పడతా అంటున్నారు భరత్. అనటమే కాదు అదే పనిలో పడ్డారు కూడా. అసలు భరత్ ఎవరు? ఎవరి అంతం చూస్తాడు అనుకుంటున్నారా? మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భరత్ అనే నేను’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్స్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సారధ్యంలో చిత్రీకరిస్తున్నారు. కేరళలోని పొల్లాచ్చిలో కొన్ని ఫైట్స్ తీశారు. బ్యాలెన్స్ సీన్స్‌ను తమిళనాడులోని కారైకుడిలో ప్లాన్ చేశారు. ఈ 25 వరకు కారైకుడిలో ఈ షెడ్యూల్ జరుగుతుందట. మహేశ్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’లో ఫైట్స్‌ను అనల్ అరసు సారధ్యంలో ఇక్కడే షూట్ చేశారు. సేమ్ ప్లేస్.. సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 తర్వాత చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంటుంది. వచ్చే నెల హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయిక. అరకోటి అభిమానులు మహేశ్‌బాబు తరచూ ట్విట్టర్ ద్వారా తన కొత్త సినిమా విశేషాలు, గౌతమ్, సితార ఫొటోలు పంచుకుంటూ ఉంటారు. ఈ సూపర్ స్టార్ అకౌంట్‌కి బోలెడంత మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. 5 మిలియన్లు అంటే అక్షరాల అర కోటి. అదేనండీ... యాభై లక్షలు. -
రంగు పడుద్ది!
అవును... రంగుల పండుగ ముసుగులో భరత్ మీద ఎటాక్ చేయాలనుకున్న రౌడీలందరి నోటి నుంచి రంగు పడుతుందట! హోలీ సందడిలో సంతోషంగా ఉన్న సామాన్యులకు ఇబ్బంది లేకుండా... సీయం భరత్ రౌడీల బెండు తీస్తాడట! కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు ముఖ్యమంత్రి భరత్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కోసం హోలీ నేపథ్యంలో ఓ ఫైట్ తీశారని ‘సాక్షి’ పాఠకులకు తెలియజేసింది. మహేశ్, కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’లో మామిడి తోట ఫైట్ ఎంత హైలైట్ అయ్యిందో... అంతకు మించి ఈ హోలీ ఫైట్ హైలైట్ అవుతుందని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారమ్. హీరోయిజమ్ అండ్ స్టైల్ ఏమాత్రం తగ్గకుండా ఈ ఫైట్‌ను డిజైన్ చేశారట! స్క్రీన్ మీద విలన్స్ రంగు పడుతుంటే... థియేటర్లో స్క్రీన్ ముందు అభిమానులు ఎగరేసే రంగు రంగుల పేపర్లు పడతాయేమో! ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఫ్యామిలీతో కలసి మహేశ్ ఫారిన్ వెళ్లారు. ఈ నెల 20వ తేదీ తర్వాత తిరిగొస్తారని తెలుస్తోంది. 26 నుంచి పొల్లాచ్చిలో కొరటాల సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. బీటౌన్ బ్యూటీ కియారా అలీ అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే! -
కోటలో మహేశ్!
అవునా... కోట ఎక్కడ ఉందేంటి? హైదరాబాద్‌లో! నిజమా... పేరేంటో? చిరాన్ ఫోర్ట్! ఊరుకోండి... ఈ రోజుల్లో రాజులు, కోటలు ఎక్కడున్నాయ్? అనుకుంటున్నారా! ఇప్పుడు మన దేశంలో రాజులు లేరు గానీ, వారసత్వ సంపదగా కోటలను మాత్రం మనకు వదిలారు... వాళ్ల పరిపాలనకు గుర్తుగా! అలాంటి కోటల్లో చిరాన్ ఫోర్ట్ ఒకటి. ఇప్పుడీ కోటలో మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా చిత్రీకరిణ జరిగింది. జూన్‌లో ఓసారి, ఇప్పుడోసారి (గత వారంలో) మూడేసి రోజులు మహేశ్, ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సిన్మాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. మహేశ్‌కి జోడీగా బీటౌన్ బేబీ కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరకర్త. -
ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది!
ముఖ్యమంత్రిగా మహేశ్‌బాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 27, 2018... తెలుగు ప్రేక్షకుల సాక్షిగా, అభిమానులందరి ముందు మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆ రోజే ఎందుకంటే... కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ రోజే! ముఖ్యమంత్రిగా మహేశ్ ప్రమాణ స్వీకారానికీ, సినిమా విడుదలకీ సంబంధం ఏంటి? అంటే... కొరటాల శివ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు కదా! అంటే... సీయెంగా మహేశ్ ఎలా ప్రమాణం చేస్తారో? అందరూ చూసేది ఆ రోజే! వచ్చే ఏడాది ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! ముఖ్యమంత్రి కథేంటి? ఒకవేళ ‘భరత్ అనే నేను’... టైటిల్‌నే ఫిక్స్ చేస్తే.. సినిమాలో ముఖ్యమంత్రి పేరు భరత్ అనుకోవాలి. అదేనండీ... హీరో పేరు. హీరో తల్లిదండ్రుల్లో దేశభక్తి ఎక్కువ అట! తల్లిదండ్రుల్లోనే కాదు... పేరుకి తగ్గట్టు కొడుకులోనూ దేశభక్తి ఎక్కువే. తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి, లక్ష్యాలు సాధించడానికి, తనయుడు రాజకీయాల్లోకి వస్తాడు. ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సీయం రాష్ట్రానికి ఏం చేశాడు? అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది చిత్రకథగా వెబ్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. అంతా రాజకీయమేనా? ...అనుకోవద్దు. ఇందులో రొమాన్స్‌కి, లవ్ లైఫ్‌కి లోటుండదట! ఇందులో మహేశ్‌కి జోడీగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాని కథానాయికగా నటిస్తున్నారు. మహేశ్, కియారా మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులందర్నీ ఎట్రాక్ట్ చేస్తుందట! ఆల్రెడీ వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. రాజకీయంలో ఎత్తుకు పైఎత్తులు, ప్రత్యర్థి వర్గాన్ని చిత్తు చేయాలనే వ్యూహాలు కంపల్సరీ. అంటే... సిన్మాలో బోల్డంత సస్పెన్స్, యాక్షన్ ఉంటుందని చెప్పొచ్చు. లవ్ సీన్లూ ఉన్నాయి. మరి, కామెడీ మాటేంటి? దర్శక–రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నటిస్తున్నారీ సినిమాలో. రాజా... విలనిజంలో కామెడీనీ, కామెడీలో విలనిజాన్నీ ఆయన ఎంత అద్భుతంగా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా! శ్రీమంతుడు ఈసారి ఏం చెబుతాడో? ‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, కొరటాల కలయికలో వస్తున్న చిత్రమిది. ‘శ్రీమంతుడు’లో గ్రామాల దత్తత అంశాన్ని ప్రతి ప్రేక్షకుడికీ అర్థమయ్యేలా కమర్షియల్ పంథాలో చెప్పిన కొరటాల, ఈ సినిమాలో రాజకీయ నేపథ్యంలో ఎలాంటి కథను చెబుతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల సినిమాల్లో ‘స్ట్రాంగ్ కంటెంట్ విత్ కమర్షియాలిటీ’ కంపల్సరీ! సందేశాన్ని చక్కగా చెబితే... తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని ‘శ్రీమంతుడు’ నిరూపించింది. ‘శ్రీమంతుడు’ విజయమే ఓ రకంగా ‘భరత్ అనే నేను’ చేయడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్ నవంబర్ 7 వరకు జరుగుతుంది. నవంబర్ 22న అవుట్డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది’’ అన్నారు. భరత్.. మాంచి స్టైలిష్ సీయెం మహేశ్ సీయెంగా నటిస్తున్నారనగానే... టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్‌లో కనిపిస్తారనుకోవద్దు. ఈ సీయం చాలా స్టైలిష్. ఇన్‌షర్టు, ఫార్మల్ ప్యాంటు, బెల్టు, బూటులు, బ్లాక్ గ్లాసెస్... ఇలా ట్రెండీ లుక్కులో మహేశ్ కనిపించనున్నారు! షూటింగులో తీసిన ఫొటోలను కొందరు నెట్టింట్లో పెట్టేశారు. దాంతో మహేశ్ లీక్డ్ లుక్ డిలీట్ చేయమంటూ స్వయంగా కొరటాల రిక్వెస్ట్ చేశారు. వచ్చే వేసవిలోపు ఈ సినిమా గురించి ఇంకెన్ని సంగతులు తెలుస్తాయో... వెయిట్ అండ్ సీ!! -
సీఎం ఛాంబర్ రెడీ!
ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్లొచ్చేశారు మహేశ్‌బాబు! ఎప్పుడంటే? జస్ట్... ఓ ట్వంటీ డేస్ బ్యాక్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’లో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిన్మా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్లో మొన్నా మధ్య మహేశ్, పోసాని కృష్ణమురళి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల గెటప్పుల్లో ఉన్న పలువురు ఆర్టిస్టులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తీశారు. త్వరలో మొదలు కానున్న మరో షెడ్యూల్లో మహేశ్‌పై ముఖ్య సన్నివేశాలు తీయనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సీయం చాంబర్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చిందని సమాచారం. అంటే... తాజా షెడ్యూల్లో ముఖ్యమంత్రిగా మహేశ్ చాంబర్లో పాల్గొనే సన్నివేశాలు తీస్తారన్న మాట. కియారా అద్వాణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. -
బన్నీ సినిమాలో ధోని హీరోయిన్..?
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. స్టార్ రైటర్‌గా పేరుతెచ్చుకున్న వక్కంతం వంశీ తొలి సారిగా డైరెక్ట్ చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చిత్రయూనిట్ ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన ధోని సినిమాతో పరిచయం అయిన కైరా అద్వానీని హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్న కైరా డేట్స్ అడ్జస్ట్ కానీ పక్షంలో లోఫర్ బ్యూటి దిశాపటానికి ఫైనల్ చేయాలని భావిస్తున్నారు.