RC15: Is Sarkarodu Titled For Ram Charan And Shankar Movie? - Sakshi
Sakshi News home page

Ram Charan-Shankar: మూవీ టైటిల్‌ ఖరారు, ఆ రోజునే అనౌన్స్‌మెంట్‌?

Mar 9 2022 11:47 AM | Updated on Mar 9 2022 12:44 PM

RC15: Is Sarkarodu Titled For Ram Charan And Shankar Movie - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇటీవల పుణేలో తొలి షెడ్యూల్‌ పూర్తవగా ప్రస్తుతం రాజమండ్రిలో RC15 టీం సందడి చేస్తోంది.

చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్‌, ఇది నాగ చైతన్యకు పోటీగానా?

ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ టైటిల్‌ ఖరారైందని, రామ్‌ చరణ్‌ బర్త్‌డే రోజున ఈ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మార్చి 27 రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో లో రామ్‌ చరణ్‌ సివిల్‌ సర్విసెస్‌ అధికారిగ కనిపించనున్నట్లు ముదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  

చదవండి: ప్రభాస్-అనుష్క పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి!

ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున రిలీజ్‌ చేసిన ఈ తొలి పోస్టర్‌లో రామ్‌ చరణ్‌, కియార అద్వాని, డైరెక్టర్‌ శంకర్‌, దిల్‌ రాజు, శ్రీకాంత్‌తో సహా మిగతా క్రూడ్‌ సూటు బూటు ధరించి ఆఫిసర్స్‌ లుక్‌లో కనిపించారు. ఈ క్రమంలో ‘సర్కారోడు’ టైటిల్‌ కరెక్ట్‌గా సెట్‌ అవుతుందని, దీంతో ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. దీనిపై చర్చలు జరిపి రామ్‌ చరణ్‌ బర్త్‌డే రోజు టైటిల్‌ అనౌన్స్‌ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అద్వాని నటిస్తుండగా.. శ్రీకాంత్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement