క్లైమాక్స్‌ ఖతమ్‌!

Mahesh Babu's Bharath Ane Nenu Completes Climax Sequence - Sakshi

ఖతమ్‌ చేశారు... విలన్స్‌ను కుమ్మేసి, వారి చెడు ఆలోచనలను ఖతమ్‌ చేశారు హీరో మహేశ్‌బాబు. బ్యాలెన్స్‌ వర్క్‌ని కంప్లీట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’.

ఇందులో కియారా అద్వాని కథానాయిక. పబ్లిక్‌ మీటింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫైట్‌ సీన్స్‌తో సహా ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ను కంప్లీట్‌ చేశారు. బ్యాలెన్స్‌ ఉన్న కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ నెల 8 వరకు కొనసాగనుందట. ఈ చిత్రంలో సీయం భరత్‌ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top