డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ! | Sakshi
Sakshi News home page

డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ!

Published Wed, Feb 21 2024 10:43 AM

Farhan Akhtar welcomes Kiara Advani to Don 3 To Star Opposite Ranveer Singh - Sakshi

డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్‌ కియారా అద్వానీ. బాలీవుడ్‌ ‘డాన్‌’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్‌ 3’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్‌ ఫర్హాన్‌ అక్తర్‌ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్‌’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్‌ 3’ మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో  కియారాకు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్‌ ‘డాన్‌ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. 

Advertisement
 
Advertisement