హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత | Barabar Premistha Director, Producer Clarity about Chandrahass Song | Sakshi
Sakshi News home page

స్టేజీపై హీరో బూతు పాట.. స్పందించిన 'బరాబర్‌ ప్రేమిస్తా' టీమ్‌

Feb 5 2026 2:13 PM | Updated on Feb 5 2026 2:20 PM

Barabar Premistha Director, Producer Clarity about Chandrahass Song

సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్‌ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్‌ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్‌ వల్ల జనాలు దండోరాను లైట్‌ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.

బూతు పాట
విషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్‌ కుమారుడు చంద్రహాస్‌ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్‌ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చంద్రహాస్‌ తనలో సింగింగ్‌ టాలెంట్‌ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్‌పై పోలీస్‌ కేసు కూడా నమోదైంది.

పొరపాటుకు చింతిస్తున్నాం
ఈ క్రమంలో బరాబర్‌ ప్రేమిస్తా టీమ్‌ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్‌ సినిమాలో తన క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.

సినిమాలో అలాంటి పాటల్లేవ్‌
దర్శకుడు సంపత్‌ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్‌ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్‌ డిఫరెంట్‌గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.

చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు  రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్‌

Advertisement
 
Advertisement
Advertisement