breaking news
Barabar Premistha Movie
-
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నాకు మాటలు రావడం లేదు. రెండు, మూడు నెలల కిందట మ్యూజిక్ లేకుండా సినిమా చూశాను. ఏడుపాగలేదుఫైనల్ కాపీ చూడలేదు. ఇప్పుడిలా థియేటర్లో సినిమా చూస్తుంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపొచ్చేసింది. థియేటర్లో సినిమా చూస్తున్న అందరూ చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే (పాట) వివాదం వల్ల నా సినిమా చూసేందుకు జనం రారేమో అని భయపడ్డాను. నా మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమోనని చాలా భయమేసింది' అంటూ చంద్రహాస్ ఏడ్చేశాడు. ఏంటా వివాదం?బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ఓ పాట పాడాడు. అందులో బూతు పదాలు దొర్లడంతో అతడిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. హీరో అయుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా? ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా? అని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్ వల్ల సినిమాపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని చిత్రయూనిట్ భయపడ్డారు. సినిమా విషయానికి వస్తే.. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది. అర్జున్ మహి విలన్‌గా యాక్ట్ చేశాడు. సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని నిర్మించారు.చదవండి: ఏడేళ్లుగా మంచానికే పరిమితమైన ముమైత్ ఖాన్ -
హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్‌ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్ వల్ల జనాలు దండోరాను లైట్ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.బూతు పాటవిషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ తనలో సింగింగ్ టాలెంట్ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్‌పై పోలీస్ కేసు కూడా నమోదైంది.పొరపాటుకు చింతిస్తున్నాంఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా టీమ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.సినిమాలో అలాంటి పాటల్లేవ్దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్‌గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్ -
యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్‌పై కేసు
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్‌మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ అశోక్‌కుమార్ తప్పబడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. పాటలో చంద్రహాస్ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన చంద్రహాస్ కౌంటర్‌గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో అశోక్‌కుమార్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్‌పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.'తప్పుడు' ప్రయాణంపిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." సైకాలజీ ఏం చెబుతోంది?సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం. "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'స్టార్డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది. -
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చంద్రహాస్ 'బరాబర్ ప్రేమిస్తా' ట్రైలర్
టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించగా.. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండనుంది. -
‘బరాబర్ ప్రేమిస్తా’తో విక్టరీ కొట్టబోతున్నాం: చంద్రహాస్
చంద్రహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా, అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్లో నిర్వహించారు. ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ – ‘‘ఫిబ్రవరి 6న ‘బరాబర్ ప్రేమిస్తా’తో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నాను’’ అన్నారు. సంపత్ రుద్ర మాట్లాడుతూ – ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే మా సినిమా. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మకంగా సాగుతుంది’’ అని చెప్పారు. -
‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. -
Barabar Premistha : ఆకట్టుకుంటున్న ఆటిట్యూడ్ స్టార్ ‘రెడ్డి మామ’ సాంగ్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకున్నారు. చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. త్వరలోనే రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.


