‘గుంజి గుంజి’ సాంగ్‌ రిలీజ్‌.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్ | Gunji Gunji from Barabar Premista, starring Chandrahass, was released by producer Bunny Vaas. | Sakshi
Sakshi News home page

‘గుంజి గుంజి’ సాంగ్‌ రిలీజ్‌.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్

Aug 20 2025 11:38 AM | Updated on Aug 20 2025 11:47 AM

Gunji Gunji Song Out From Barabar Premistha Movie

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement