బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.
ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.


