బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తీస్తున్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2'. డిసెంబరు 5న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'ద తాండవం' అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. తొలి పార్ట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 2021లో విడుదల చేశారు. ఈసారి పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ: నటుడు చిన్నా)
ఇందులో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఎప్పటిలానే చెవులు దద్దరిల్లే సంగీతమందించాడు. విజువల్స్ చూస్తుంటే బోయపాటి మార్క్ స్పష్టం కనిపిస్తుంది. డిసెంబరు 5న ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరి ఈసారి అఖండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?
(ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి: మహేశ్)


