మరికొన్ని గంటల్లో మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ భారీ లెవల్లో జరగబోతుంది. శనివారం(నవంబరు 15) సాయంత్రం హైదరాబాద్ శివారులో ఈ వేడుక జరగనుంది. గత కొన్నిరోజుల్లో పలు ప్రమాదాలు జరిగిన దృష్ట్యా.. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే వీడియో రిలీజ్ చేసి తగు జాగ్రత్తలు చెప్పారు.
ఇప్పుడు హీరో మహేశ్ బాబు వంతు వచ్చింది. పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్) ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుందని, లేదంటే మాత్రం వచ్చేయకండి అని సుతిమెత్తగా చెప్పారు. ఇంకా చాలా ఈవెంట్స్ ఉండనే ఉంటాయని అభిమానులు కంగారుపడొద్దని జాగ్రత్తలు చెప్పారు.
'ఈవెంట్ రోజున ఆర్ఎఫ్‌సీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుంది. మీతో పాటు ఉన్న పాస్ స్కాన్ చేస్తే మీరు ఏ గేటు నుంచి రావాలో చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించండి. పోలీసులకు, సెక్యూరిటీ వాళ్లకు సహకరించండి. పోలీసులు మనకు చెప్పింది ఏంటంటే.. అందరూ ఎంత తక్కువ ట్రాన్స్‌పోర్టేషన్‌తో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి. మనకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం' అని మహేశ్ బాబు చెప్పారు.
SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కుంభ పాత్రలో పృథ్వీరాజ్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా పాత్రల ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేశ్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు అనౌన్స్‌మెంట్ వీడియోని కూడా భారీ స్క్రీన్ పై ప్లే చేయనున్నారు. ఈవెంట్ వెళ్లలేకపోతే హాట్‌స్టార్ ఓటీటీలో దీన్ని లైవ్‌గా చూడొచ్చు.
Tomorrow it is… 🤗🤗🤗
Come safely, enjoy it and go home safely.❤️❤️❤️ #GlobeTrotter pic.twitter.com/5ybhjJ5ZP4— Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2025


