న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఒక రోజు ముందే కేక్ కట్ చేశారు నయనతార. ఎక్కడంటే..‘మూకుతి అమ్మన్ 2’ సినిమా సెట్స్‌లో. నయనతార ప్రధాన పాత్రలో నటించిన డివైన్ ఫిల్మ్ ‘మూకుతి అమ్మన్ 2’. సుందర్. సి దర్శకత్వంలో ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌సంస్థతో కలిసి ఇషారి కె.గణేష్ ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్‌లో కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ చిత్రంలో దునియా విజయ్, రేజీనా, యోగిబాబు, ఊర్వశీ, అభినయ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘మహాశక్తి’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక నయనతార ప్రధాన పాత్రధారిగా నటించిన ‘మూకుతి అమ్మన్’ (‘అమ్మోరు తల్లి’ అనేది ఈ సినిమా తెలుగు టైటిల్) సినిమా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పుపొందింది. ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు.


