ప్రముఖ తమిళ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్ ’. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మమితాబైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , ప్రకాష్ రాజ్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి జనవరి 9న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగులో ‘జన నాయకుడు’ టైటిల్ తో రిలీజ్ అవుతుంది.
తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ‘ఒక పేరే అలరారు..’ అనే పాట లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఒక పేరే అలరారు.. అరిచారో చేలరేగు..అది నీవే జన నాయక, మది కోరే పెనుమార్పు అది నీవే అని తీర్పు..జయహో రా..జనసేవక’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందిం చగా, విశాల్ మిశ్రా ఆలపించారు. ప్రియమణి, నరైన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.


