ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారారు. ఇప్పటివరకు స్టేజీలపై తన గానం, సంగీతంతో అలరించిన ఆయన పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించారు. గతంలో దర్శకనిర్మాతగానూ పరిచయం చేసుకున్న రెహమాన్ తాజాగా నటుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. మూన్‌వాక్ సినిమాలో డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో కలిసి నటిస్తున్నారు.
యంగ్ డైరెక్టర్‌గా
బిహైండ్‌వుడ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ ఎస్‌ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పలు ప్రత్యేకతలతో రూపొందుతోందని దర్శకుడు పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అనే తనే ప్రత్యేకతను మించి మూన్‌వాక్ మూవీ ద్వారా నటుడిగా రంగప్రవేశం చేస్తున్నాననన్నారు. ఇందులో తాను ఆక్రోశం కలిగిన యంగ్ డైరెక్టర్‌గా కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ 5 పాటలను ఆయనే పాడటం మరో విశేషం.
ప్రభుదేవాతో డ్యాన్స్
ఒక పాటలో ప్రభుదేవాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవమని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా నటించగా, యోగిబాబు త్రిపాత్రాభినయం చేశారని చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను జనవరి 4న చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో అంజు వర్గీస్, అర్జున్ అశోకన్ సాక్షి, సుష్మిత, నిష్మా, స్వామినాధన్, రెడిన్ కింగ్‌స్టన్, రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే నెలలో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


