చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. కథ బాగుండే సినిమాయే ఆడుతుంది. కంటెంట్ బాగుండి, నిజాయితీతో సినిమా తీస్తే హిట్ చేస్తామని ఈషా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు చెప్పారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ఈషా.
డిసెంబర్ 25న రిలీజైన ఈషా
శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి, బన్నీ వాస్ డిసెంబర్ 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈషా జర్నీ చాలా పెద్దది. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు అని తెలిపారు. ఈషా ఆడియన్స్‌కు కనెక్ట్ కాకపోతే ఐదురోజుల్లోనే ఆరు కోట్ల గ్రాస్ వచ్చేవి కావు అని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఆడియన్స్ సపోర్ట్ చేయడం వల్లే ఈషా వంటి చిత్రాలు విజయాన్ని సాధిస్తుంటాయి అని వంశీ నందిపాటి చెప్పారు.
ఐదు రోజుల్లోనే..
సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి.. అంతేకానీ మమ్మల్ని వేధించకండి. మా సినిమాకు వచ్చిన రివ్యూస్, రేటింగ్స్ చూసి సూసైడ్ చేసుకుందాం అనిపించింది. ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామా అని భయంతో వణికిపోయాను. ఆ నెగెటివిటీ చూసి చనిపోవాలనే అనిపించింది. అదంతా తట్టుకుని ఇప్పుడు స్టేజీపై నిలబడ్డాను అని శ్రీనివాస్ పేర్కొన్నారు. మా మూవీకి ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి అని హేమ వెంకటేశ్వరరావు అన్నారు.
గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్


