తెలుగులో పలు సినిమాల్లో సహాయ నటిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న హేమ.. గతంలో బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. గత కొన్నాళ్లుగా అయితే మూవీస్‌లో యాక్ట్ చేయట్లేదు. కానీ గతేడాది ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలతో ఈమెని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బయటకొచ్చిన హేమ.. తను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది. కానీ తను జైలుకెళ్లడం చూసి తల్లి తట్టుకోలేకపోయిందని, అనారోగ్యానికి గురైందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో హేమ తల్లి తుదిశ్వాస విడిచింది.
హేమ తల్లి కోళ్ల లక్ష‍్మి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. సోమవారం రాత్రి ఈమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న హేమ.. స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడిందని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని చెబుతూ గట్టిగా ఏడ్చేసింది.


