టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గతవారమే ఈ సంఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తన తండ్రి మరణంతో జోష్ రవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా అనేది నీకు సరదా..నాకు సినిమానే బతుకుదెరువు.. సినిమా నాకు సెంటిమెంట్.. అది నీకు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమా అనేది నీకు వీకెండ్.. నాకు టిల్ మై లైఫ్ ఎండ్..అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు కష్టాలు మర్చిపోవడానికి థియేటర్‌కు వస్తావ్.. నేను తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని నవ్విస్తాను.. నీకు బాధ వస్తే ఏడుస్తావ్.. అదే నాకు వస్తే సినిమా చూస్తా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తన తండ్రి చనిపోయినా కూడా బాధను దిగమింగుకుని షూటింగ్ పూర్తి చేశారు. ఇది చూస్తుంటే ఆయనకు సినిమాపై ఉన్న కమిట్‌మెంట్ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు జోష్ రవికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. 'జోష్' సినిమాతో నటుడిగా పరిచయమైన రవి.. తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించాడు. 'జబర్దస్త్' కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.


