'జోష్' సినిమాతో నటుడిగా పరిచయమైన రవి.. తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు తెలుగు చిత్రాల్లో నటించాడు. 'జబర్దస్త్' కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం చోటుచేసుకుంది. రవి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గతవారమే ఈ సంఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)
పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో రవి తల్లిదండ్రులు ఉంటున్నారు. మూడో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఇంటికి తీసుకెళ్లగా.. దారిలోనే గుండెపోటు రావడంతో చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత)


