బిగ్‌బాస్ తెలుగు 9లో సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డెమాన్ పవన్, రీతూల మధ్య జరిగిన గొడవ ప్రధానంగా నిలిచింది. ఆపై సుమన్ శెట్టి, డెమాన్ పవన్‌లు ఇద్దరూ కల్యాణ్‌పై మాటల తూటాలు పేల్చారు. అయితే, ఈ వారం నామినేషన్స్‌లో ఒక్కోక్కరికి కల్యాణ్ అంతే రేంజ్‌లో తరిగిచ్చిపడేశాడు. కప్టెన్‌గా ఉన్న తనూజ నామినేషన్స్ విషయంలో ఫుల్ స్ట్రాటజీతో తన అభిమానులను మెప్పించింది.

రీతూను కాపాడిన తనూజ
ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చేతిలో బిగ్‌బాస్ పెట్టాడు. ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది తనూజకే ఆప్షన్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ముద్రపడిన భరణి, ఇమ్మాన్యుయేల్‌కు షాకిచ్చింది. ఇద్దరిని నామినేషన్ చేయమని ఆమె కోరింది. కానీ, కల్యాణ్, సుమన్‌లకు మాత్రం సింపుల్‌గా ఒక్కరిని మాత్రమే నామినేషన్ చేయమని సూచిస్తుంది. ఫైనల్‌గా నామినేషన్‌లోకి 'దివ్య, రీతూ, డెమాన్ పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్'లు వస్తారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరినైనా ఒక్కరిని సేవ్ చేయమని కెప్టెన్ తనూజను బిగ్‌బాస్ కోరుతాడు. దీంతో రీతూను సేవ్ చేస్తున్నట్లు తనూజ చెబుతుంది. అలా ఈ వారం నామినేషన్ నుంచి రీతూ బయటపడింది.
డెమాన్‌లో మార్పు రాకుంటే ఇంటికే
ఎపిసోడ్ ప్రారంభం కాగానే డెమాన్ పవన్,రీతూ ఒకే బెడ్‌పై ఒకే బెడ్ షీట్‌లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైమ్‌లో వారి మద్యలోకి కల్యాణ్ రావడంతో డెమాన్ పవన్ ఫీల్ కావడమే కాకుండా లేచి వెళ్లిపోతాడు. మరుసటిరోజు పొద్దున్నే రీతూని కూర్చోబెట్టి క్లాస్ పీకుతాడు. మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు (కల్యాణ్) వచ్చాడు. అప్పుడు వాడ్ని పంపించేయొచ్చు కదా అంటూ రీతూపై ఫైర్ అవుతాడు. అలా రావద్దని కల్యాణ్‌కు ఎలా చెబుతాను రా అంటూ పవన్‌ను తిరిగి ప్రశ్నిస్తుంది. ప్రతి చిన్నవిషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్నావ్ ఏంట్రా అంటూ గట్టిగానే రీతూ నిలదీస్తుంది.

దాంతో పవన్ ఇంకా దిగజారిపోయేలా తిరిగి కౌంటర్ ఇస్తాడు. అలా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నువ్వు నాకు వద్దుని రీతూపై మండిపడతాడు. ఇలాంటి చెత్త కారణాలు చూపుతూ ఫైనల్‌గా రీతూను పవన్ నామినేట్ చేయడం మరీ దారుణంగా అనిపిస్తుంది. ఇక్కడ రీతూ చాలా హుందాగా పవన్‌తో వ్యవహరించింది. కానీ, పవన్ ఈ ఎపిసోడ్‌తో చాలా డ్యామేజ్ చేసుకున్నాడు. ఈ వారం ఫ్యామిలీ వీక్‌లో భాగంగా పవన్ మదర్ వెళ్తున్నారట. ఆమె ఏమైనా సలహాలు ఇచ్చిన తర్వాత తన గేమ్‌ను మార్చుకునే ఛాన్స్ ఉంది. ఈ గొడవతో రీతూ, పవన్‌లలో ఒక్కరు మాత్రమే టాప్-5కు చేరుకుంటారని తెలుస్తోంది.
కల్యాణ్ అదరగొట్టేశాడు
ఈ వారంలో కల్యాణ్‌ను సుమన్, పవన్, సంజనా నామినేట్ చేశారు. అయితే, పూర్తిగా కల్యాణ్ పైచేయి సాధించాడు. ముగ్గురికి సరైన కౌంటర్స్‌తో ఇచ్చిపడేశాడు. మొదట డెమాన్ పవన్ రంగంలోకి దిగి కల్యాణ్‌ను నామినేట్ చేస్తూ.. పాత విషయాలను తీసుకొస్తాడు. గతంలో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి పిచ్చిపిచ్చి స్టేట్‌మెంట్స్‌తో కల్యాణ్‌పై మాటలు తూలుతాడు. నమ్మకం గురించి కొన్ని విషయాలను గుర్తూ చేస్తూ కల్యాణ్‌ను తప్పుబట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ, కల్యాణ్ ఎప్పుడు కూడా పవన్ విషయంలో మోసం చేయలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో పవన్ చేతిలోనే కల్యాణ్ మోసపోయాడు. రీతూ కోసం అతన్ని ఆట నుంచే తప్పించేశాడు. ఇలా కొన్ని చెత్త రీజన్లతో పవన్‌కు బాగా మైనస్ అయిపోయింది.

సుమన్ ఫైర్
టవర్ టాస్క్‌లో వరస్ట్ సంచాలక్ అంటూ కల్యాణ్‌ను నామినేట్ చేస్తున్నట్లు సుమన్ చెప్తాడు. టవర్ స్ట్రైట్‌గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ ఫైర్ అవుతాడు. అయితే, వీకెండ్‌లో నాగార్జున చూపించిన వీడియోతో తేలిపోయింది. నిజమైన విన్నర్ సంజనానే అని ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇదే విషయాన్ని కల్యాణ్ కూడా చాలా బిగ్గరగానే వినూ.. వినూ.. అంటూ వేలు చూపిస్తూ సుమన్ శెట్టి మీదికి వెళ్లాడు. దాంతో సుమన్ శెట్టి రిటర్న్‌గా వేలు దించూ కల్యాణ్ అంటూ ఊగిపోతాడు. ఆ తర్వాత కల్యాణ్ వేలు నీ వైపు చూపించడం లేదన్నా అంటూ చెప్పడంతో వాగ్వాదం ముగిసింది. ఇక సంజన కూడా సిల్లీ రీజన్‌తోనే కల్యాణ్‌ను నామినేట్ చేసింది. ఆ టాపిక్ గురించి చెప్పుకోవడం టైమ్ దండగ.. మొత్తానికి ఈ వారం నామినేషన్‌లో కల్యాణ్ దమ్మున్న పాయింట్లతో తిరిగి కౌంటర్ ఇచ్చాడు.


