బిగ్‌బాస్ 9 తెలుగులో ఈ వారం మొత్తం సందడిగా కనిపించనుంది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎమోషన్స్‌తో పాటు సంతోష క్షణాలు కనిపిస్తాయి. సుమారు 70రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తుండటంతో అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఫస్ట్ ఎంట్రీ తనూజ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ టీమ్ ప్రోమో వదిలింది.

తనూజ చెల్లి పూజ బిగ్‌బాస్‌లోకి వచ్చింది. తనను చూడగానే ఒక్కసారిగా తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిరోజుల్లోనే తన పెళ్లి ఉందంటూ పూజను అందరికీ పరిచయం చేస్తుంది. తనూజ బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల పెళ్లికి వెళ్లడం కుదరదు. దీంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది. హౌస్‌లోనే పసుపు, కుంకుమతో పాటు బొట్టు పెట్టి ఆపై కొన్ని గాజులు, బట్టలు తన చెల్లి ఒడిలో పెడుతుంది. అక్కగా ఆశీర్వదించగా పూజ కూడా తనూజ కాళ్లకు నమష్కారం చేస్తుంది.
తనూజ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. అక్క అనూజ లాయర్ కాగా.. చెల్లి పూజ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అనూజకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె కూతురు కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లింది.


