టేస్టీ తమలపాకు రైస్
కావలసినవి
తమలపాకులు – 4 లేదా 5
జీలకర్ర, మిరియాలు – అర టీ స్పూన్ చొప్పున
అన్నం – ఒక కప్పు
(మరీ మెత్తగా ఉyì కించకూడదు)
ఉల్లిపాయ ముక్కలు – కొన్ని
వెల్లుల్లి రెబ్బలు – 4
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నువ్వుల నూనె, నెయ్యి, ఆవాలు, మినప్పప్పు – ఒక టీస్పూన్ చొప్పున
కరివేపాకు రెబ్బలు – కొన్ని
ఇంగువ – చిటికెడు (అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా తమలపాకులను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకులు, మిరియాలు, జీలకర్ర కలిపి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీటిని జోడించవచ్చు. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకుని, తాలింపు రెడీ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకుని, అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. పసుపు వేసి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేవరకూ వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న తమలపాకు పేస్ట్ వేసి, కొద్దిగా నీళ్లు జోడించి 3 నిమిషాలు వేయించుకోవాలి. అనంతరం అన్నం, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలపాలి. అనంతరం ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకుని, అన్నం మెతుకులు విరిగిపోకుండా మెల్లగా కలపాలి.
అవకాడో లడ్డూ
కావలసినవి
అవకాడో పేస్ట్ – ఒకటిన్నర కప్పు
(గింజ తీసి, ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి)
కొబ్బరి పాలు, పీనట్ బటర్ – 6 టేబుల్ స్పూన్లు చొప్పున
తేనె లేదా పంచదార పొడి – తగినంత
రోల్డ్ ఓట్స్ – పావు కప్పు
(పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి)
బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి – కొద్దిగా
ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్)
కొబ్బరి తురుము – కొద్దిగా
(అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో రోల్డ్ ఓట్స్ పౌడర్, కొబ్బరి పాలు, పీనట్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, అవకాడో పేస్ట్, ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
అనంతరం రుచికి సరిపడా తేనె లేదా పంచదార పొడి వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకుని, చేతులకు నెయ్యి పూసుకుని, చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
బనానా–చాక్లెట్ వొంటన్స్
కావలసినవి: అరటిపండు గుజ్జు – పావు కప్పుపైనే
చాక్లెట్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లుపైనే
జీడిపప్పు, వాల్‌నట్స్, బాదం పప్పు – 4 టేబుల్ స్పూన్ల చొప్పున (నేతిలో దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి)
గుడ్డు తెల్లసొన – ఒకటి
పంచదార పొడి – కొద్దిగా (అభిరుచిని బట్టి)
చీజ్ – 2 టేబుల్ స్పూన్లు
వొంటన్ రేపర్స్ – 20 (మార్కెట్‌లో దొరుకుతాయి)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో అరటిపండు గుజ్జు, చాక్లెట్ పౌడర్, జీడిపప్పు మిశ్రమం, పంచదార పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో చీజ్, గుడ్డు తెల్లసొన వేసుకుని బాగా కలిసి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వొంటన్ రేపర్స్‌లో పెట్టుకుని.. నచ్చిన షేప్‌లో మడిచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అభిరుచిని బట్టి పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే, ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.
(చదవండి: ట్రెండ్‌గా..మోడర్న్ ఊయలలు..!)


