breaking news
Avocado
-
లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆచరణలో పెట్టి విజేతగా నిలిచాడు. కోటి రూపాయల సంపాదనతో నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యువరైతుగా ఎదిగి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా నిలిచాడు. లండన్‌లోని ఒక లేబుల్ ద్వారా ప్రేరణ పొంది, ఇజ్రాయెల్‌లో శిక్షణ పొందిన హర్షిత్ గోధా ఇప్పుడు భారతీయ రైతులకు స్వదేశంలో ప్రపంచ స్థాయి అవకాడోలను పెంచడంలో సహాయం చేస్తున్నాడు. 2023 నాటికి, అతని వెంచర్ ‘ఇండో ఇజ్రాయెల్ అవకాడో’ రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించింది.హర్షిత్ రైతు కుటుంబం నుండి రాలేదు. కానీ ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది - ఇజ్రాయెల్ దాని పొడి వాతావరణంతో అవకాడోలను విస్తృతంగా పండించగలిగినపుడు భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అనే ప్రశ్నతో తన స్వస్థలమైన భోపాల్‌కు తిరిగి వచ్చాడు. వెంటనే, టూరిస్ట్ వీసాపై ఇజ్రాయెల్‌కు విమానం ఎక్కాడు. అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నాడు. భోపాల్ శివార్లలో కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల బంజరు భూమిని తీసుకొని దానిని మార్చడం ప్రారంభించాడు. నేల అభివృద్ధి, నీటి-సమర్థవంతమైన బిందు వ్యవస్థలు, గ్రీన్‌హౌస్‌లు , నర్సరీ ఏర్పాటు కోసం అతను రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు. తొలి ఏడాదిలో మంచి లాభాలను సాధించాడు. కానీ మద్య కోవిడ్ మహమ్మారి ఛాలెంజ్ విసిరింది. అయినా నిరాశ పడలేదు. హర్షిత్ ఈ సమయాన్ని విద్య కోసం ఉపయోగించుకున్నాడు. ఒక బ్లాగును ప్రారంభించి అవకాడో వ్యవసాయంపై ఉచిత ఇ-పుస్తకం రాశాడు YouTube, LinkedInలో తన జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. వందలాది మంది ఆశావహులైన రైతులు అతనికి లేఖలు రాయడం ప్రారంభించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదలమీద ఆధారణపడకుండా మల్చింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతాడు. రసాయన ఎరువులను వాడడు. అతను నేల ఆరోగ్యం, నీటి నిలుపుదలని పెంచడానికి కంపోస్ట్, సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తాడు.ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ అవకాడో మొక్కలను నిర్వహిస్తున్నాడు. రైతులకు శిక్షణ ఇస్తున్నాడు ,స్థానికంగా పండించిన, అధిక నాణ్యత గల పండ్ల కోసం వెతుకుతున్న లగ్జరీ హోటళ్ళు, బోటిక్ దుకాణాలు, చెఫ్‌లతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు వర్క్‌షాప్‌లు, శిక్షణా సెషన్లు ,మెంటర్షిప్ ద్వారా, హర్షిత్ ఇతరులు కూడా తమ అవకాడో తోటలను ప్రారంభించడంలో సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.2023 నాటికి, ఇండో ఇజ్రాయెల్ అవకాడో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ హర్షిత్ కోసం, ఇది కేవలం సంపాదన ఆర్జన మాత్రమే కాదు. ,నా లక్ష్యం అవకాడోలను పండించడం మాత్రమే కాదు,” “ప్రతి లేబుల్‌పై ‘సోర్స్డ్ ఇన్ ఇండియా’ని అనే తన కలను నిజం చేయడమే.” అంటారు. యాంటీఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క గొప్ప మూలం అయిన అవకాడో గుజ్జులో ప్రోటీన్లు (4 శాతం వరకు) , కొవ్వు (30 శాతం వరకు) ఎక్కువగా ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వలన ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులు, హోటళ్ళు, రెస్టారెంట్లు , జిమ్‌ల నుండి అధిక డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. పైగా కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం, జీవనశైలిమీద అవగాహన పెరిగింది. ఇదీ చదవండి: భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడుప్రపంచ బ్యాంకు వాణిజ్య డేటా ప్రకారం, భారతదేశం 2023లో 39 లక్షల కిలోల అవకాడోలను దిగుమతి చేసుకుంది, ఎక్కువగా టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అవకాడోకు ఇండియాలో ఉన్న డిమాండ్‌ను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. -
ట్రెల్లిస్ : అవకాడో, దానిమ్మ.. ఇలా పండించవచ్చు!
ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ లేదా తీగజాతి పంటలను Y ఆకారంలో ఉండే ఇనుప ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చెయ్యటం తెలిసిందే. అయితే, ఫ్రటెల్లి ఫ్రూట్స్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఎఫ్పీసీ) దానిమ్మ, అవకాడో వంటి పొద పంటలను సైతం వినూత్నంగా ఈ పద్ధతిలోనే సాగు చేస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ సమీపంలో పింపాల్గోన్ బసంత్ వద్ద ఫ్రటెల్లి ఫ్రూట్స్ వ్యవసాయ క్షేత్రం ఉంది. అనంత్ బి మోర్ దీనికి చైర్మన్‌గా ఉన్నారు. భారతీయ ఉద్యాన తోటల సాగు రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. డ్యూక్ 7 వేరు మూలంపై గ్రాఫ్ట్ చేసిన మలుమ అవకాడో చెట్లను, భగువ రకం దానిమ్మ చెట్లను ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్‌లో భాగంగా ట్రెల్లిస్ పద్ధతిలో ద్రాక్షతో పాటు దానిమ్మ, అవకాడో తోటలను పెంచుతున్నారు. మొక్కలు నాటేటప్పుడే శాస్త్రీయ పద్ధతిలో నేలను సిద్ధం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతిని అనుసరిస్తున్నారు. కొమ్మలను ట్రెల్లిస్కు అనుగుణంగా ప్రూనింగ్ చేస్తూ పెంచుతున్నారు. కొమ్మలన్నిటికీ సూర్యరశ్మి, గాలి తగలడానికి, కాయ కోతకు, పిచికారీ చేసే ద్రావణాలు/ పురుగుమందులు చెట్టు మొత్తానికీ అందించడానికి, సమర్థవంతంగా చీడపీడలను నియంత్రించ డానికి.. ఇలా ఈ పద్ధతి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. కాయలన్నిటికీ ఎండ తగిలేలా చూడటం ద్వారా మచ్చలు లేని, నిగారింపుతో కూడిన నాణ్యమైన కాయలను పండిస్తోంది ఫ్రటెల్లి ఫ్రూట్స్ ఎఫ్పీసీ. సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో, భారీ వర్షాల తర్వాత కూడా ఆరోగ్యదాయకమైన దానిమ్మ పండ్ల దిగుబడి తీస్తుండటం విశేషం. ఎఫ్పీసీ సభ్యులైన రైతులకు అధిక దిగుబడులు సాధించడానికి లాభదాయకమైన, మెరుగైన సాగు పద్ధతులపై ఈ ఎఫ్పీసీ శిక్షణ ఇస్తోంది. చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!25–26 తేదీల్లో బయోచార్‌పై జాతీయ సదస్సుభూసారం పెంపుదలతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగించటంలో ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసే కట్టె బొగ్గు (బయోచార్) ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. అంతర్జాతీయంగా కార్బన్ క్రెడిట్స్ పొందే అవకాశం ఉండటంతో రైతులతో పాటు అనేక మంది వ్యక్తులు, వాణిజ్య సంస్థలు బయోచార్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25,26 తేదీల్లో ‘ప్రోగ్రెస్సివ్ బయోచార్ సొసైటీ, హైదరాబాద్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్ఐ–ఎంఎస్ఎంఈ (నిమ్స్‌మే) ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. సొసైటీ అకడమిక్స్ డైరెక్టర్ డా. ఎం.ఎ. ఆరిఫ్ ఖాన్ – 97018 76662. -
పోషకాల పండు..లాభాలు మెండు 'అవకాడో'
చింతపల్లి: గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.» కాఫీ చెట్లకు నీడనిచ్చేందుకు తీసుకొచ్చిన విదేశీ మొక్క» పోషకవిలువలున్నఫలాలనూఇస్తోంది.. » చింతపల్లిఉద్యాన పరిశోధన స్థానంలో 6 దేశీ, విదేశీ రకాలపై పరిశోధనలు చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు.ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లివిదేశీ పంటలకు అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడాఇస్తున్నాయి. -
Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు
విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి. గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
స్ప్రే డ్రైడ్ అవొకాడో పౌడర్..!
అవొకాడో పండులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా మెండుగా ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్. కొద్ది నెలలే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు కాబట్టి, పొడిగా మార్చి పెట్టుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్ పండ్ల పరిశోధనా విభాగం అధిపతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. జి. కరుణాకరన్, తదితర శాస్త్రవేత్తలు అవొకాడోపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. ఐఐహెచ్ఆర్ అవొకాడో పండును ప్రీసెసింగ్ చేసి స్ప్రే డ్రయ్యింగ్ పద్ధతిలో పొడిగా మార్చే సాంకేతికతను రూపివదించింది. అత్యంత నాణ్యమైన అవొకాడో పొడిని ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. గది సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఈ పొడి మూడు నెలల పాటు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అవొకాడో పండును ఏడాది పొడవునా నిల్వ చేయటం కష్టం. అయితే, ఈ పొడిని నిల్వ చేయటం, రవాణా చేయటం సులభం. ఈ ఉత్పత్తికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. రూపాయి పెట్టుబడి పెడితే 1.78 రూపాయల ఆదాయాన్ని పొందటానికి స్ప్రే డ్రయ్యింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఆసక్తి గల ఆహార పరిశ్రమదారులు ఐఐహెచ్‌ఆర్‌కు నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సాంకేతికతను పొంది అవొకాడో పొడిని తయారు చేసి అనేక ఉత్పత్తుల్లో వాడుకోవచ్చు లేదా దేశ విదేశాల్లో విక్రయించుకోవచ్చు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ వెబ్సైట్ చూడండి. (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!)