
స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆచరణలో పెట్టి విజేతగా నిలిచాడు. కోటి రూపాయల సంపాదనతో నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యువరైతుగా ఎదిగి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా నిలిచాడు. లండన్‌లోని ఒక లేబుల్ ద్వారా ప్రేరణ పొంది, ఇజ్రాయెల్‌లో శిక్షణ పొందిన హర్షిత్ గోధా ఇప్పుడు భారతీయ రైతులకు స్వదేశంలో ప్రపంచ స్థాయి అవకాడోలను పెంచడంలో సహాయం చేస్తున్నాడు. 2023 నాటికి, అతని వెంచర్ ‘ఇండో ఇజ్రాయెల్ అవకాడో’ రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించింది.
హర్షిత్ రైతు కుటుంబం నుండి రాలేదు. కానీ ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది - ఇజ్రాయెల్ దాని పొడి వాతావరణంతో అవకాడోలను విస్తృతంగా పండించగలిగినపుడు భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అనే ప్రశ్నతో తన స్వస్థలమైన భోపాల్‌కు తిరిగి వచ్చాడు. వెంటనే, టూరిస్ట్ వీసాపై ఇజ్రాయెల్‌కు విమానం ఎక్కాడు. అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నాడు.
భోపాల్ శివార్లలో కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల బంజరు భూమిని తీసుకొని దానిని మార్చడం ప్రారంభించాడు. నేల అభివృద్ధి, నీటి-సమర్థవంతమైన బిందు వ్యవస్థలు, గ్రీన్‌హౌస్‌లు , నర్సరీ ఏర్పాటు కోసం అతను రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు. తొలి ఏడాదిలో మంచి లాభాలను సాధించాడు. కానీ మద్య కోవిడ్ మహమ్మారి ఛాలెంజ్ విసిరింది. అయినా నిరాశ పడలేదు. హర్షిత్ ఈ సమయాన్ని విద్య కోసం ఉపయోగించుకున్నాడు. ఒక బ్లాగును ప్రారంభించి అవకాడో వ్యవసాయంపై ఉచిత ఇ-పుస్తకం రాశాడు YouTube, LinkedInలో తన జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. వందలాది మంది ఆశావహులైన రైతులు అతనికి లేఖలు రాయడం ప్రారంభించారు.
భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదలమీద ఆధారణపడకుండా మల్చింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతాడు. రసాయన ఎరువులను వాడడు. అతను నేల ఆరోగ్యం, నీటి నిలుపుదలని పెంచడానికి కంపోస్ట్, సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తాడు.
ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ అవకాడో మొక్కలను నిర్వహిస్తున్నాడు. రైతులకు శిక్షణ ఇస్తున్నాడు ,స్థానికంగా పండించిన, అధిక నాణ్యత గల పండ్ల కోసం వెతుకుతున్న లగ్జరీ హోటళ్ళు, బోటిక్ దుకాణాలు, చెఫ్‌లతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు వర్క్‌షాప్‌లు, శిక్షణా సెషన్‌లు ,మెంటర్‌షిప్ ద్వారా, హర్షిత్ ఇతరులు కూడా తమ అవకాడో తోటలను ప్రారంభించడంలో సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.
2023 నాటికి, ఇండో ఇజ్రాయెల్ అవకాడో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ హర్షిత్ కోసం, ఇది కేవలం సంపాదన ఆర్జన మాత్రమే కాదు. ,నా లక్ష్యం అవకాడోలను పండించడం మాత్రమే కాదు,” “ప్రతి లేబుల్‌పై ‘సోర్స్డ్ ఇన్ ఇండియా’ని అనే తన కలను నిజం చేయడమే.” అంటారు. యాంటీఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క గొప్ప మూలం అయిన అవకాడో గుజ్జులో ప్రోటీన్లు (4 శాతం వరకు) , కొవ్వు (30 శాతం వరకు) ఎక్కువగా ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వలన ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులు, హోటళ్ళు, రెస్టారెంట్లు , జిమ్‌ల నుండి అధిక డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. పైగా కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం, జీవనశైలిమీద అవగాహన పెరిగింది.
ఇదీ చదవండి: భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు
ప్రపంచ బ్యాంకు వాణిజ్య డేటా ప్రకారం, భారతదేశం 2023లో 39 లక్షల కిలోల అవకాడోలను దిగుమతి చేసుకుంది, ఎక్కువగా టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అవకాడోకు ఇండియాలో ఉన్న డిమాండ్‌ను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.