భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్‌ వదిలేశాడు | Indian college dropout leaves job to take care of pregnant wife | Sakshi
Sakshi News home page

భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్‌ వదిలేశాడు

Aug 12 2025 1:25 PM | Updated on Aug 12 2025 3:51 PM

Indian college dropout leaves  job to take care of pregnant wife

భార్యామణికోసం, ఆమె ప్రేమకోసం అందమైన ప్రేమ మందిరాన్ని నిర్మించిన ఘనత మనది. ఉద్యోగం ఒక లెక్కా అనుకున్నాడో ఏమోగానీ తాజాగా గర్భవతి అయిన జీవిత భాగస్వామి కోసం కోటి రూపాయలిచ్చే ఉద్యోగాన్ని ఒక భారతీయుడు.  కోటి రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఘటన నెట్టింట సందడిగా మారింది.  దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందించారు.

గర్భవతిగా ఉన్న భార్యను చూసుకోవడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఇండియన్‌ పెట్టిన రెడ్డిట్‌పోస్ట్‌ వైరల్‌గా మారింది.  జయనగర్‌లో  రూ. 1.2 కోట్ల జీతం, వర్క్‌ఫ్రం హోంఅ యినా భార్యకంటే ఇవేవీ ముఖ్యం కాదు అంటూ రాసుకొచ్చాడుఅతగాడు.. తన భార్య గర్భధారణ ప్రయాణంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని  చెప్పాడు. గర్భం అని తెలియగానే మొదట ఉద్యోగం వదిలేయమని అడిగిన భార్య ఆ తరువాత ఉద్యోగం  చేయాలని కోరిందని అయితే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకునేందుకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే తనకున్న పరిచయాలు, ,అనుభవంతో ఎప్పుడైనా మార్కెట్‌లోకి తిరిగి రాగలననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.  లైఫ్‌లో సరైన సమయంలో సరైన ప్లేస్‌లో ఉండటం చాలా ముఖ్యమైందంటూ తన పోస్ట్‌ను ముగించాడు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను కూడా కొన్ని పంచుకున్నాడు. ‘‘కాలేజీ డ్రాపౌట్, స్టార్టప్‌లలో పనిచేస్తూ 7 సంవత్సరాలలో 0 నుండి 7కోట్లకు  చేరుకున్నా’’ అని తెలిపాడు.

ఇదీ చదవండి: లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
 

ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే అతని నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకునే స్థోమతలో అందరూ ఉండరని చాలామంది వ్యాఖ్యానించారు. “మీరు.. మీ భార్య అదృష్టవంతులు, కానీ అందరి స్టోరీ ఒకేలా ఉండదు. చాలామందికి ఉద్యోగాలను కోల్పోవడం చాలా  దుర్భరం, “ చాలా బాగుంది, జీవిత ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇది ఉత్తమ నిర్ణయం అని నేను భావిస్తున్నాను, జీవిత వాస్తవ అనుభవం లేదా కేవలం అనుభవానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి అంటి కొందరు అభినందనలు తెలిపారు. “తెలివైన మనిషి!తక్కువ ఒత్తిడితో కూడిన సంపాదన అవకాశాలను అన్వేషించే వీలు చిక్కుతుంది. ఇది మీ బిడ్డను చూసుకుంటూ మీరు సంపాదించేలా చేస్తుంది.’’ అని మరొకరు విషెస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement