breaking news
Pregnan
-
భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు
భార్యామణికోసం, ఆమె ప్రేమకోసం అందమైన ప్రేమ మందిరాన్ని నిర్మించిన ఘనత మనది. ఉద్యోగం ఒక లెక్కా అనుకున్నాడో ఏమోగానీ తాజాగా గర్భవతి అయిన జీవిత భాగస్వామి కోసం కోటి రూపాయలిచ్చే ఉద్యోగాన్ని ఒక భారతీయుడు. కోటి రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఘటన నెట్టింట సందడిగా మారింది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందించారు.గర్భవతిగా ఉన్న భార్యను చూసుకోవడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఇండియన్ పెట్టిన రెడ్డిట్పోస్ట్ వైరల్‌గా మారింది. జయనగర్‌లో రూ. 1.2 కోట్ల జీతం, వర్క్‌ఫ్రం హోంఅ యినా భార్యకంటే ఇవేవీ ముఖ్యం కాదు అంటూ రాసుకొచ్చాడుఅతగాడు.. తన భార్య గర్భధారణ ప్రయాణంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. గర్భం అని తెలియగానే మొదట ఉద్యోగం వదిలేయమని అడిగిన భార్య ఆ తరువాత ఉద్యోగం చేయాలని కోరిందని అయితే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకునేందుకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే తనకున్న పరిచయాలు, ,అనుభవంతో ఎప్పుడైనా మార్కెట్లోకి తిరిగి రాగలననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. లైఫ్‌లో సరైన సమయంలో సరైన ప్లేస్‌లో ఉండటం చాలా ముఖ్యమైందంటూ తన పోస్ట్‌ను ముగించాడు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను కూడా కొన్ని పంచుకున్నాడు. ‘‘కాలేజీ డ్రాపౌట్, స్టార్టప్‌లలో పనిచేస్తూ 7 సంవత్సరాలలో 0 నుండి 7కోట్లకు చేరుకున్నా’’ అని తెలిపాడు.ఇదీ చదవండి: లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే అతని నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకునే స్థోమతలో అందరూ ఉండరని చాలామంది వ్యాఖ్యానించారు. “మీరు.. మీ భార్య అదృష్టవంతులు, కానీ అందరి స్టోరీ ఒకేలా ఉండదు. చాలామందికి ఉద్యోగాలను కోల్పోవడం చాలా దుర్భరం, “ చాలా బాగుంది, జీవిత ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇది ఉత్తమ నిర్ణయం అని నేను భావిస్తున్నాను, జీవిత వాస్తవ అనుభవం లేదా కేవలం అనుభవానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి అంటి కొందరు అభినందనలు తెలిపారు. “తెలివైన మనిషి!తక్కువ ఒత్తిడితో కూడిన సంపాదన అవకాశాలను అన్వేషించే వీలు చిక్కుతుంది. ఇది మీ బిడ్డను చూసుకుంటూ మీరు సంపాదించేలా చేస్తుంది.’’ అని మరొకరు విషెస్ తెలిపారు. -
ఇదేం ‘మార్పు’
బాల్కొండ, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలంటూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం వల్ల గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు మండల పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7, 8, 9 నెలల గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతినెల వైద్య పరీక్షలు జరిపించుటకు గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ ర్భిణులను ఆస్పత్రులకు తీసుకొస్తారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వచ్చేటప్పుడు 108 వాహనంలో ఉచితంగా తీసుకువస్తారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లడానికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించకుండా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలి నడకన కొందరు, ఆటోల్లో మరికొందరు స్వగ్రామాలకు వెళుతున్నారు. అధికారులు తమ రికార్డులు మెరుగు పరుచుకోవడం కోసం మార్పు కార్యక్రమం విజయవంతం కావడానికి గతంలో ఇంటింటికి తిరిగారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని సూచించారు. కానీ నిండు గర్భిణులను ఆస్పత్రి వరకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో పడే ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలు నిండిన గర్భిణులకు కూడా అవస్థలు తప్పడం లేదు. ఇదేమి ‘మార్పు’ అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు చెల్లించలేమంటున్న ఏఎన్ఎంలు గర్భిణులను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ వర్కర్లు కొన్ని సందర్భాల్లో ఆటోల్లో, బస్సుల్లో చార్జీలు చెల్లించి గర్భిణులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ చార్జీలు భరించలేమని చెబుతున్నారు. అసలే కాంట్రాక్ట్ ఉద్యోగులు. వేతనాలు ఏడాదికోసారి ఇస్తారు. వాటిలో నుంచి ప్రతినెల రూ. 100 నుంచి రూ.200 సొంతంగా భరించి గర్భిణులకు చార్జీలు చెల్లిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారుకూడా మిన్నకుండటంతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని గర్భిణులు కోరుతున్నారు.