పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అలానే ఈసారి గురువు గొప్పతనాన్ని ఆవిష్కరించే వీడియోతో మన ముందుకొచ్చారు. ముందుండి గొప్పగా నడిపించే గురువు ఉంటే ఏ విద్యార్థి అయినా మహనీయుడు(రాలు) అవుతాడంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మహీంద్రా ఆ వీడియోలో ఉపాధ్యాయులు విద్యార్థిలోని ప్రతిభను ఎలా సానపెట్టి బయటకు తీసుకోస్తారో వివరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఒక చిన్నారి తన గురువుని అనుకరిస్తూ..అత్యంత అద్భుతంగా అభినయిస్తూ చేసిన డ్యాన్స్ అందరీ మనసులను దోచుకుంది. వావ్ ఏం బాగా చేసింది అనేలా..అత్యద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. తన గురువు తోపాటు కాలు కదిపిన ఆ చిన్నారి స్టెప్పులకు కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా చేస్తుంది.
ఇంత అద్భుతంగా ఆ చిన్నారిని తీర్చిదిద్దిన ఆ గురువు ముందుగా ప్రశంసనీయడు అని మెచ్చుకున్నారు మహీంద్రా. ఉపాధ్యాయుడి శక్తిమంతమైన ప్రమేయం..విద్యార్థిని ఉన్నతంగా మార్చగలదు అనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ అని అన్నారు. విద్యార్థి ఆత్మవిశ్వాసంతో కనబర్చే ప్రతిభ..అతడి గురువు గైడెన్స్ ఏవిధంగా ఉందనేది చెప్పకనే చెబుతుందన్నారు.
నిజమైన గురువులు చేతలతోనే గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతారు..వాళ్ల వల్లే అభివృద్ధి చెందాలనే కోరిక బలీయమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి అద్బుతంగా రాణించేలా చేసే ఉపాధ్యాయుల ఆశీర్వాదం లభిస్తే..వాళ్లకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అంటూ గురువు విశిష్టతను నొక్కి చెప్పారు మహీంద్రా.
“The mediocre teacher tells. The good teacher explains.
The superior teacher demonstrates.
The great teacher inspires.”
— William A. Ward
This young lady is an absolute delight to watch. She radiates the pure joy of movement.
But her Guru deserves equal praise: someone who not… pic.twitter.com/OWee7I1kaf— anand mahindra (@anandmahindra) November 15, 2025
(చదవండి: 1996లో బ్యాంక్ పాస్ బుక్ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..)


