ప్రపంచ నంబర్ 1, ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక, అన్ ప్రొఫెషనల్‌గా ప్రవర్తించాడు.
నిరాశతో టేబుల్‌ను బలంగా కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Arjun Erigaisi wins and Magnus Carlsen slams the table 💥!https://t.co/9kA44nR1gV pic.twitter.com/fPeZmggftd
— chess24 (@chess24com) December 29, 2025
కార్ల్‌సన్‌కు ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. ఇదే ఏడాది నార్వేలో జరిగిన ఓ టోర్నీలో కూడా భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ చేతిలో ఓటమి తర్వాత ఇలానే టేబుల్‌ను బలంగా కొట్టాడు.
ప్రస్తుత టోర్నీలోనే రష్యా గ్రాండ్‌మాస్టర్ ఆర్టెమియేవ్ చేతిలో ఓటమి తర్వాత కూడా కోపంతో ఊగిపోయి, కెమెరాను తోసేశాడు.
కార్ల్‌సన్ తరుచూ ఇలా ప్రవర్తించడం ప్రస్తుతం చెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్ల్‌సన్‌పై చర్యలు తీసుకోవాలని అభిమానులు ప్రపంచ చెస్ ఫెడరేషన్‌ను డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, కార్ల్‌సన్‌పై విజయంతో వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఎరిగైసి పాయింట్ల సంఖ్య 7.5కు చేరింది. తద్వారా ఎరిగైసి ఉజ్బెకిస్తాన్‌కి చెందిన నోడిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.


