సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. అలా ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో హాబీ ఉంటుంది. వీటిలో ఎక్కువగా పెట్ లవర్స్ ఉంటారు. అలా నటి త్రిష కృష్ణన్ కూడా సునక ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఈమె ఇంటిలో పెట్ డాగ్స్ ఎక్కువగానే ఉంటాయి. అంతే కాకుండా తను ట్రావెలింగ్ చేస్తున్న దారిలో ఏదైనా కుక్క బాధింపులకు గురైతే దాన్ని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. ఇలా పెట్ అభిమాని అయిన త్రిష పెటా సమాఖ్యకు బ్రాండ్ అంబాసీడర్‌గానూ వ్యవహరించారు. ఇక తన పెట్ డాగ్ మరణిస్తే మనిషి మరణించినంతగా బాధ పడతారు.

తాజాగా తన పెట్ కుక్క పిల్ల (ఐజీ కృష్ణన్) పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తన పెంపుడు కుక్క మొదటి ఏడాది పుట్టిన రోజును నిర్వహించిన త్రిష, తన ఇంటిపెరట్లో కాగితపు తోరణాలు, బెలూన్లతో సుందరంగా డెకరేషన్ చేసి, తన కుక్కపిల్లకు ఇష్టమైన రకరకాల ఆహారాన్ని కేక్ చుట్టు ఏర్పాటు చేశారు. ఆ కుక్క పిల్ల తనకు చాలా ప్రత్యేకం. డాగ్ ఫుడ్‌కు సంబంధించి ప్రముఖ కంపెనీకి బ్రాండ్‌అంబాసిడర్‌గా ఆ కుక్క పిల్ల ఉన్నడం విశేషం. త్రిషకు ఎంతో ప్రత్యేకమైన తన డాగ్‌కు నూతన వ్రస్తాలు ధరింపజేసి ఒళ్లో కూర్చోపెట్టుకుని ముద్దాడి, దానికి బదులు తనే కేక్ కట్ చేసి ,తినిపించి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన కుక్క పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా ఆమె ప్రారంభించడం విశేషం.
ఇదంతా చూస్తుంటే మహాకవి శ్రీశ్రీ రాసిన కుక్కపిల్ల.. సబ్బుబిళ్ళ... అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్న అంశం గుర్తుకొస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నటి త్రిషకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం ఆమె నటించిన విడాముయర్చి, థగ్స్ లైఫ్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపడటమే కావచ్చు. కాగా ప్రస్తుతం తమిళంలో ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర ఆపై మలయాళంలో రామ్ అనే చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉన్నాయి. అయితే కొత్త అవకాశాలేవీ లేవన్నది గమనార్హం.


