బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చారు. వాస్తవంగా ఆదివారం ఎపిసోడ్‌లోనే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ, ఈసారి కంటెస్టెంట్స్‌కు షాకిస్తూ శనివారం ఎపిసోడ్‌లోనే ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఆపై ఆదివారం ఎపిసోడ్‌లో మరోకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఫైనల్‌గా తక్కువ ఓట్లు తెచ్చుకుని నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్‌లో గౌరవ్ ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది.
అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లో నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. అయితే, అతడికి వారానికి రూ.2.5 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.12.5 లక్షల మేరకు సంపాదించాడు. అతనికి తెలుగు బుల్లితెరపై మంచి ఫేమ్ ఉండటంతో రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు. గృహలక్ష్మి సీరియల్‌లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు.
నిఖిల్ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి రాగానే నాగార్జున ప్రశంసించారు. చాలా బాగా ఆడావ్ అంటూ అతని ఆట తీరును ప్రశంసించారు. హౌస్‌మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే చెప్పాలని నాగ్ కోరడంతో నిఖిల్ ఇలా చెప్పాడు. తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ తనకు నచ్చవని సింపుల్‌గా చెప్పేశాడు.


