breaking news
Nikhil Nair
-
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్‌ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్‌మేట్స్‌తో తలపడి గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్‌తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్‌గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్‌కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
నిఖిల్ నాయర్... ఆక్స్ఫర్డ్ స్కాలర్
లక్ష్యం మనిషిని ముందుకు నడిపిస్తుంది. ప్రేరణ అనుకున్నది సాధించేలా చేస్తుంది. ఈ రెండూ ఆ యువకుని జీవితాన్ని మార్చాయి. డిగ్రీతో చదువును ఆపేద్దామనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశాయి. ఓవైపు ఉద్యోగం చేస్తూ.. విదేశాల్లో ఉన్నత విద్య కోసం పరితపించాడు. ఫలితం... ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశం.. ఆపై అరుదైన సెయిడ్ బిజినెస్ స్కూల్ 2014-15 స్కోల్ స్కాలర్‌షిప్‌నకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడితే నలుగురు మాత్రమే ఎంపికవగా...అందులో ఏకైక భారతీయుడైన మన హైదరాబాదీ నిఖిల్ నాయర్ సక్సెస్ స్టోరీ.. బెంగళూర్‌లోని క్రైస్ట్ కాలేజ్‌లో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తయ్యాక చదువు ఆపేద్దామనుకున్నాను. తర్వాత సెల్కో కంపెనీలో సోలార్ ఎనర్జీ సిస్టమ్‌లో ప్రాజెక్టు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ బయట పరిస్థితులు చూశాక ఎంబీఏ విలువేంటో తెలిసింది. జీ మ్యాట్‌కు ప్రిపరేషన్: నా ప్రయాణంలో అత్యంత క్లిష్టమైంది జీమ్యాట్ ప్రిపరేషన్. పక్కా సమయపాలనతో మూడు నెలలు కష్టపడ్డాను. నెలకోసారి మాక్‌టెస్టులు రాశాను. 550 మార్కులకు తగ్గకుండా జాగ్రత్త పడ్డాను. ఎక్కువగా అప్లికేషన్ తరహా ప్రశ్నలను సాధన చేశాను. అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్, క్వాంటిటేటివ్, వెర్బల్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ ఇలా అన్ని అంశాలను ప్రాధాన్య పరంగా చదివాను. క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగంలో ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా సఫీషియన్సీలో మంచి స్కోరు సాధించేందుకు ఇచ్చిన స్టేట్మెంట్లో మినహారుుంపులు, ముగింపు, వాదనలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకున్నాను. అర్థమెటిక్, ఆల్జీబ్రా, ఎలిమెంటరీ జామెట్రీల్లో పట్టు సాధించాను. వెర్బల్ విభాగమే విజయమార్గం: వెర్బల్ క్వాంట్ కష్టమనిపించింది. దీనికి ప్రిపరేషన్లో అదనపు సమయాన్ని కేటాయించాను. దీనినుంచి 41 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి విజయావకాశాలు నిర్ణయించేది ఇదే. అనలిటికల్ రైటింగ్ ఎబిలిటీలో రాణించాలంటే విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానాలు రాయాలి. సామర్థ్యం ఆధారంగా: జీమ్యాట్‌లో అభ్యర్థుల సామర్థ్య స్థాయిని బట్టి ప్రశ్నలు మారుతుంటాయి. ఉదాహరణకు పరీక్షలో ఒక క్లిష్టమైన ప్రశ్నకు సులువుగా సమాధానం ఇవ్వగలిగితే..తర్వాత అంతకంటే కష్టమైన ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. కఠినమైన ప్రశ్నలకు సులువైన వాటికంటే ఎక్కువ మార్కులుంటాయి. ప్రతి విభాగంలో మొదటి ప్రశ్నకు ఏమేర సరిగ్గా సమాధానం రాస్తున్నారనే అంశంపై ఆధారపడి క్లిష్టత ఉంటుంది. అనుభవంతో అందలం: 2014-15 స్కోల్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికవడానికి కారణం నా అనుభవమే. సెల్కో ఇండియాలో ఆఫ్‌గ్రిడ్ ప్రాజెక్టు అసిస్టెంట్ మేనేజర్‌గా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా ఉన్న మైక్రోసాల్ ఇంటర్నేషనల్‌లో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్‌గా, ఆ తర్వాత కెన్యా రాజధాని నైరోబీలోని ఎం.కోపా అనే సోలార్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేసి వ్యాపార అభివృద్ధి బృందంలో సేల్స్ కార్యక్రమాలు నిర్వహించాను. వీటితో పాటు మొబైల్ ఆధారిత యాప్స్‌ను సాంకేతిక నిపుణులతో కలిసి ఆవిష్కరించడంలో కృషి చేశాను. ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రంగాల్లో సాధించిన అనుభవమే నా అభివృద్ధికి ఎంతో దోహదపడింది. సేవలో సైతం: నవంబర్ 2011 - ఫిబ్రవరి 2012 మధ్యలో సోలార్ ఈ-బస్ ప్రాజెక్టును హెడ్లీ జాకోబ్స్ సహాయంతో చేపట్టాను. కర్ణాటకలోని గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను చేరువ చేయడమే ఈ సోలార్ ఇ-బస్ లక్ష్యం. ఇందులో అమర్చిన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, దీపాలు.. ఇలా అన్నీ సౌర శక్తితో నడిచేలా రూపొందించాం. అలాగే సోలార్ ఫర్ రూరల్ డెయిరీ కోపరేటివ్స్కు విక్షత్ ముంద్కర్తో కలిసి అంకురార్పణ చేశాం. ప్రతిభకు ప్రశంసలు: ఎంటర్ ప్రైజ్ ఎల్ఈడీ డెవలప్మెంట్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ యువ పారిశ్రామిక వేత్తలను చైతన్యపరిచే లక్ష్యంతో 2010 డిసెంబర్లో దేశవ్యాప్తంగా చేపట్టిన జాగృతి యాత్రకు ఎంపిక.మిడిల్ ఈస్ట్ చాంపియన్‌షిప్ ఫర్ టేబుల్ టాపిక్స్ పోటీల్లో రెండోస్థానం టోస్ట్ మాస్టర్స్ అంతర్జాతీయ గ్రూప్‌లో సభ్యత్వం సెయిడ్ బిజినెస్ స్కూల్ 2014-2015 ఎంబీఏ స్కాలర్‌గా ఎంపిక సలహా: నేటి పోటీ యుగంలో వృత్తిపరమైన కోర్సులను ఎంచుకునే వారు సరికొత్త నైపుణ్యాలను ఆకళింపు చేసుకోవాలి. ఒక్కోసారి చదువుతో పని లేకున్నా ఈ నైపుణ్యాలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కాబట్టి ఆ దిశగా కృషి చేయాలి. 1 ఐబీపీఎస్ పీవో ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్ హైదరాబాద్: ఐబీపీఎస్ అక్టోబర్ 18, 19, నవంబర్ 1, 2 తేదీల్లో వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరి ఆఫీసర్ల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనుంది. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షలో మొత్తం ప్రశ్నల సంఖ్య 200. సమయం రెండు గంటలు. ఎల్లప్పుడూ విద్యార్థుల హితం కోరే సాక్షి సమగ్ర స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించడంతో పాటు నిపుణులతో రూపొందించిన ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్టులను రూపొందించింది. వీటితో పాటు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘కీ’తో కూడిన మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు: అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన 3 గ్రాండ్ టెస్ట్‌లు 24/7 ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ ఫర్ఫార్మెన్స్ రిపోర్టులు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్ వెబ్సైట్: http://onlinetests.sakshieducation. com/ www.sakshieducation.com/Banks/Index.html