
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్‌ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. కాకపోతే ఆ కండెండర్‌షిప్‌ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్‌మేట్స్‌తో తలపడి గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నాడు.
కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురు
గార్డెన్ ఏరియాలో బాల్‌తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్‌గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్‌కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి!