బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు లీకులు వచ్చేశాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది.లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశారట. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఆరుగురు రాబోతున్నారట. వీళ్లలో ముగ్గురు సీరియల్ నటులే కావడం విశేషం. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరెవరు వస్తున్నారు? వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూద్దాం.రమ్య మోక్షసోషల్ మీడియాలో పికెల్స్ (ఊరగాయలు) బిజినెస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న రమ్య మోక్ష.. వైల్డ్ కార్డ్‌గా రాబోతుందట. చెప్పాలంటే రమ్యతో పాటు ఈమెకు మరో ఇద్దరు అక్కలు ఉన్నారు. వీళ్లంతా కలిసి ఆన్లైన్లో పికెల్స్ బిజినెస్ చేస్తుంటారు. అయితే ఈమె ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. గొడవల విషయంలో ఎక్కడా తగ్గదు. ఈమెని ఇన్ స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హౌస్‌లోకి వస్తే చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశముంది.శ్రీనివాస్ సాయి'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ అవి ఏ మాత్రం ఇతడి కెరీర్‌కి ఉపయోగపడలేదు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. దీంతో బిగ్‌బాస్ వాళ్లు అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేసినట్లున్నాడు. కుర్రాడు కాబట్టి హౌసులోకి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్స్ లాంటివి ఉండొచ్చు.నిఖిల్ నాయర్'గృహలక్ష్మి' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులు తెలిసిన ఇతడు.. 'పలుకే బంగారమాయెనా' సీరియల్లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు. సిక్స్ ప్యాక్ కూడా ఉంది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ. సీరియల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి బాగా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులున్నాయి.గౌరవ్ గుప్తాప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ చేస్తున్నారు. ఇతడు కూడా సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తున్నాడు. హౌసులోకి వెళ్లిన తర్వాత అటు లవ్ ట్రాక్స్‌తో పాటు ఫిజికల్‌గానూ మంచి పోటీ ఇచ్చే ఛాన్సుంది. చూడాలి మరి ఏం చేస్తాడో?ఆయేషా జీనత్వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్‌తో ఇక్కడ కాస్త పాపులరే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్లోనూ పాల్గొంది. గతంలో తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన అనుభవం ఈమెకుంది. ఈమె వైల్డ్ కంటెస్టెంట్‌గా వైల్డ్ ఫైర్ చూపించే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఆటనే కాదు గ్లామర్ పరంగానూ హౌసులోకి చాలామందికి పోటీ ఇవ్వడం గ్యారంటీ.దివ్వల మాధురిసోషల్ మీడియాలో రీల్స్‌తో పాపులారిటీ తెచ్చుకున్న దివ్వల మాధురి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిన్నటి వరకు సందేహంగానే ఉంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.