తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన ఏకైక కంటెస్టెంట్ ఆయేషా. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వైల్డ్ ఫైర్‌లా అగ్గి రాజేస్తుందని అంతా అనుకున్నారు. నామినేషన్స్‌లో ఆమె ఊపు, అరుపులు, కేకలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ పనిగట్టుకుని గొడవలు పడటం జనాలకు చిరాకు తెప్పించింది. టైఫాయిడ్, డెంగ్యూ వల్ల పట్టుమని పదిరోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
నా అవతారంపై మీమ్స్
అదే వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష (Ramya Moksha Kancharla) కూడా ఎలిమినేట్ అయింది. అయితే తాను కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అనారోగ్యంతో బాధపడ్డానని, అవేవీ షోలో చూపించలేదని చెప్తోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టింది. అందులో రమ్య ఏమందంటే.. నా లుక్‌పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ వేశారు. వాటిలో కొన్ని నేనూ చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్‌బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను. ఇంతలో టాన్సిల్స్ అయ్యాయి. దానివల్ల గొంతు, కింది దవడ ఉబ్బిపోయింది.
బిగ్‌బాస్ హౌస్‌లో అనారోగ్యంతో బాధపడ్డా!
సడన్‌గా హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బందిపడ్డా.. స్కిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చింది. చేతులు, మెడ, మొత్తం శరీరమంతా రాషెస్ వచ్చాయి. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లమ్ ఎదురైంది. ఇది చాలదన్నట్లు జంక్ ఫుడ్ తిని, సోడా తాగడంతో హౌస్‌లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియా (నీళ్ల విరేచనాలు)తో బాధపడ్డా.. ఇలా నా ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించనేలేదు. అసలు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను.
మేకప్ కూడా వేసుకోను
ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా. నేను ఎలిమినేట్ అయినరోజు నా ముఖం కాస్త సన్నగా కనిపించింది. అదే నిజమైన నేను. టీవీలో చబ్బీగా కనిపించాను. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, నేను బక్కగానే ఉంటాను. స్నాప్‌చాట్ వంటి యాప్స్ కూడా ఏవీ నేను వాడను. అసలవి ఎలా వాడాలో కూడా తెలీదు. మేకప్ వేసుకుంటే నా కళ్లు ఎర్రబడి, నీళ్లు కారతాయి. జలుబు, తలనొప్పి వస్తుంది. అందుకే మేకప్ కూడా వేసుకోను. ఇకపోతే నెగెటివిటీ గురించి నేనసలు లెక్కచేయను. వాటిని ఎలా గాలికొదిలేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య చెప్పుకొచ్చింది.
చదవండి: ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్


