
వైల్డ్‌కార్డులు హౌస్‌లో అడుగుపెట్టేముందు ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). అలా పచ్చళ్లమ్ముకునే రమ్య మోక్షకు బంపరాఫర్ ఇచ్చాడు. తనకు ఎప్పుడంటే అప్పుడు.. ఏది కావాలంటే అది.. నచ్చిన వంటకాలను అడిగితే బిగ్‌బాస్ కాదనుకుండా పంపిస్తాడని నాగార్జున చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్ రమ్య (Ramya Moksha) వదులుకుంటుందా? సమస్యే లేదు.
పెద్ద లిస్ట్ ఇచ్చిన రమ్య
టిఫిన్‌లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరీ, మైసూర్ బజ్జీ.. లంచ్‌కి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, వెజ్ టిక్కా పిజ్జా, బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు కావాలంటూ సరుకుల లిస్ట్ చదువుతూనే ఉంది. ఈ లిస్ట్ విని బిగ్‌బాస్ గుడ్లు తేలేయడం ఖాయం. ఈ ఫుడ్‌ను సుమన్‌తో షేర్ చేసుకుంటానంది. అక్కడితో ఆగలేదట! 5 కిలోల చికెన్ కూడా అడిగేసిందట! పనిలో పనిగా చికెన్ పచ్చడి పెడుతుందేమో మరి!
తినలేక తంటాలు
దొరికిందే ఛాన్స్ అని ఆర్డర్ పెట్టింది కానీ ఆ వంటకాలన్నీ తినలేక నానా అవస్థ పడినట్లు తెలుస్తోంది. ఏకంగా వాంతులు కూడా చేసుకుందంటున్నారు. మరి ఆర్డర్ చేసిన వంటకాలను మిగతా హౌస్‌మేట్స్‌కు పంచారా? లేదంటే రమ్య కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని బిగ్‌బాస్ ఏమైనా ఆర్డర్లు వేశారా చూడాలి!