
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటం గర్ల్‌గా పలు సినిమాలు చేసింది దీప్షిక నగ్పాల్ (Deepshikha Nagpal). షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'కోయిల' మూవీ (Koyla Movie)లో ఓ అభ్యంతకర సన్నివేశంలో యాక్ట్ చేసింది. అందులో దుస్తులు తొలగిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. అది నిజం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోయిల మూవీ డైరెక్టర్ రాకేశ్ సర్ నాకు ఆ సన్నివేశం గురించి ముందే చెప్పారు. నా తల్లి ఎదురుగానే సీన్ వివరించారు. సరే, షూటింగ్ ఎప్పుడు? అని ఎటువంటి బెరుకు లేకుండా అడిగాను.
డ్రెస్ ధరించే సీన్ కంప్లీట్ చేశా
నేను చెప్పింది అంతా గుర్తుందిగా? అని ఆయన మరోసారి క్రాస్‌చెక్ చేసుకున్నారు. గుర్తుందని బదులిస్తూనే మీరేం భయపడవద్దని ధైర్యం చెప్పాను. కెమెరాను నా ఎదురుగా కాకుండా టాప్ యాంగిల్‌లో పెట్టమన్నాను. కేవలం నా భుజాల వరకే కనిపించేలా జాగ్రత్తపడ్డాను. నేను డ్రెస్ తీసేస్తున్నట్లుగా మీకు కనిపించింది కానీ, మినీ టాప్, అలాగే జీన్స్ నా ఒంటిపై అలాగే ఉన్నాయి. బట్టలు ధరించే ఎంతో సులువుగా ఆ సీన్ పూర్తి చేశాం. కానీ సినిమా రిలీజయ్యాక ఆ సీన్ ఎంతో వివాదాస్పదమైంది.
హేళన చేశారు
కెమెరా ముందు దుస్తులు తొలగించావా? అని నా అనుకున్నవాళ్లే నన్ను దారుణంగా విమర్శించారు. ఆ మాటలకు ఎన్నోసార్లు ఏడ్చాను. ఒకసారి నా కూతురు కోయిల సినిమా సీడీని కోపంతో విరిచేసింది కూడా! సినిమాల్లోలాగే నిజ జీవితంలో కూడా నేను అలాగే చేస్తానని నా క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. నా పిల్లలు కూడా నన్ను గౌరవించరని హేళన చేశారు అని చెప్తూ ఎమోషనలైంది. ఒకప్పుడు సినిమాలు చేసిన దీప్షిక.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఈమెకు రెండు పెళ్లిళ్లవగా రెండుసార్లు విడాకులయ్యాయి. హిందీ బిగ్‌బాస్ 8వ సీజన్‌లో పాల్గొనగా మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయింది.
చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ