
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో జైలు జీవితం అంటే ఎవరైనా బాధపడతారు, అవమానంగా ఫీలవుతారు. కానీ, ఫ్లోరా మాత్రం తెగ సంబరపడిపోయింది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా జైల్లో అడుగుపెట్టింది. ఆమెను రిలీజ్ చేయమని బిగ్‌బాస్ కెప్టెన్‌ను ఆదేశించినప్పుడు మాత్రం తెగ బాధపడిపోయింది. అప్పుడే అయిపోయిందా! అని నిరాశచెందింది.
ఐదో వారం ఎలిమినేట్
దానికి కారణం.. హౌస్‌మేట్స్‌తో పెద్దగా కలవదు. తన పనేదో తను చేసుకుపోతోంది. హౌస్‌లో ఉండాలన్న ఆసక్తి కూడా తనకేమంత లేదు. ప్రతివారం ఎలిమినేషన్‌కు రెడీగా ఉంది. ఒకానొక సమయంలో తను సేవ్ అయినట్లు నాగార్జున చెప్పగానే ఏంటి? నిజమా! అని నోరెళ్లబెట్టింది. తను కోరుకున్నట్లుగా ఐదో వారం హౌస్ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేసింది. తాజాగా సాక్షి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లోరా పెళ్లి గురించి ఓపెన్ అయింది.
అందుకే నాకు పెళ్లొద్దు
'నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న రెండుమూడేళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా నా ఫ్రెండ్స్‌ను చాలామందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్లకూడదనుకుంటున్నా.. రిలేషన్‌షిప్‌లోనే సంతోషంగా ఉన్నాను' అని ఫ్లోరా సైనీ చెప్పుకొచ్చింది. ఫ్లోరా సైనీ మరో పేరు ఆశా సైనీ. ఈ బ్యూటీ తెలుగులో ప్రేమ కోసం, నువ్వు నాకు నచ్చావ్, చాలా బాగుంది, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు వంటి పలు సినిమాలు చేసింది. పదేళ్లుగా హిందీలోనే చిత్రాలు చేస్తోంది.
