
బిగ్‌బాస్ షోలో (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది.
రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్
నిజానికి కల్యాణ్ (Pawan Kalyan Padala) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్.
ఫుల్ క్లారిటీ
కల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్‌లో దూసుకుపోవడం ఖాయం!
చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక!