
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్‌లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్‌లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్‌తో ఇద్దరు షాక్‌లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
సరదా గేమ్స్
నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్‌మేట్స్‌తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్‌లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు.

ఏడ్చేసిన రీతూ
అయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్‌లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్‌గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది.
శ్రీజకు తుత్తర ఎక్కువే
ఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్‌లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్‌లాంటి పాయింట్స్ పెడుతుంది.
రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్
కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్‌పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.
చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?