
బిగ్‌బాస్ 9లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా రమ్య మోక్ష (Ramya Moksha) హౌస్‌లో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ.. తన జర్నీ గురించి ఏవీ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్‌మిల్క్ ఎంత ఫేమస్సో నేనూ అంతే ఫేమస్.. మాదొక చిన్న ఫ్యామిలీ. అమ్మా నాన్న.. రమ్య, అలేఖ్య, సుమ. ఇదే మా కుటుంబం.
షూటింగ్‌కు వెళ్లిన రోజే..
నాకు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. నేను చేసిన ఫిట్‌నెస్ వీడియోలకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించాం. తక్కువ సమయంలోనే మా వ్యాపారం బాగా ఎదిగింది. ఒకరోజు సినిమా షూటింగ్ ఉందని కొడైకెనాల్ వెళ్లాను. ఆరోజు ఉదయం ఐదు గంటలకు నాన్న చనిపోయారు. నేను వచ్చేసరికి నాన్నను తీసుకెళ్లిపోయారు.
సినిమా చేయకుండా ఉండాల్సింది
నేను ఎంతో బతిమాలి చివరకు రెండు నిమిషాలు నాన్నను కడసారి చూసుకున్నాను. నేను ఆరోజు షూట్‌కు వెళ్లకుండా ఉండాల్సింది. అసలు ఆ సినిమాయే చేయకుండా ఉండాల్సింది అనిపించింది. నాన్న చనిపోయిన తర్వాతి వారమే ఆడియో రిలీజ్‌లంటూ వివాదాల్లో చిక్కుకున్నాం. ఎవరెవరో వచ్చి ఊరికనే తిట్టేవాళ్లు. చాలా ఫేస్ చేశాం. అప్పుడు మా అక్క కోపం తట్టుకోలేక రివర్స్‌లో తిట్టింది.
కెరీర్‌పై ఫోకస్ పెట్టా..
క్షణికావేశంలో జరిగిన తప్పు వల్ల మా జీవితాలు తారుమరయ్యాయి. బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బిగ్‌బాస్‌లాంటి ప్లాట్‌ఫామ్‌లో అవకాశం దొరికితే నేను వదలుకుంటానా? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ అని చెప్పుకొచ్చింది. మరి బిగ్‌బాస్ షోలో రమ్య మెప్పిస్తుందా? ట్రోలర్స్‌కు ఛాన్స్ ఇస్తుందా? చూడాలి!