
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డ్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది.

వాయించేసిన నాగ్
మాధురి (Divvala Madhuri).. హౌస్‌కు రెండో బిగ్‌బాస్‌లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్ సుమన్‌ను అడిగాడు నాగ్. అందుకు సుమన్ తడుముకోకుండా మాధురిదే తప్పన్నాడు. ఆరోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి క్లాస్ పీకాడు. నా గొంతే అలా ఉంటుందని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్ ఖండించాడు.
సూపర్ పవర్ నిర్వీర్యం
మరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్‌ను రద్దు చేసే పవర్ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్ ఇప్పుడు నిర్వీర్యమైపోయింది.
చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం