
బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో దివ్వెల మాధురి (Madhuri Divvala) వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే బంధాలు, బంధుత్వాలు జాన్‌తానై.. ఆడేందుకు వచ్చా, గెలిచే పోతా అని ధీమాగా చెప్తోంది. అంతేకాదు, తన పేరును దువ్వాడ మాధురిగా మార్చేసుకుంది. తన ఇంట్రో వీడియోలో ఇంకా ఏమందంటే.. నాది ముక్కుసూటిగా ఉండేతత్వం.. అందుకే ఫైర్‌బ్రాండ్ అని పిలుస్తుంటారు. నాకు ఇంటర్‌లోనే పెళ్లి చేశారు. ఆరాధ్య, అర్హ, అఖిల.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వీళ్లే నా ప్రపంచం.
కలిసుందామని ప్రయత్నించా..
మొదటినుంచీ నాకు, నా భర్తకు మధ్య అండర్‌స్టాండింగ్ తక్కువ. అయినా సరే కలిసుండేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. కానీ, అస్సలు కుదురలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారు. తనతో నా జర్నీ మొదలైంది. మాధురి అంటే శ్రీనివాస్.. శ్రీనివాస్ అంటే మాధురిగా నాలుగేళ్లుగా కలిసి బతుకుతున్నాం.

అర్థమైందా రాజా
అయితే ఈ నాలుగేళ్లలో నేను నరకం చూడని రోజంటూ లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నాపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలని చూడకుండా నా కూతుర్లని ట్రోల్ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తారు, అర్థమైందా రాజా.. అని ఇంట్రో వీడియోలో పేర్కొంది.
ఆయన వద్దంటే షోకి రాకపోయేదాన్ని
నాగార్జున దగ్గర కూడా మాట్లాడుతూ.. సమాజమంతా ఒకవైపు నిలబడితే.. నేనొకవైపు నిలబడ్డాను. నా జీవితం నాకు నచ్చితే చాలు, ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దాదాపు 80% మంది నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకా 20% మంది ఎందుకు నాకు నెగెటివ్‌గా ఉండాలి. వారిని కూడా నావైపు తిప్పుకోవడానికే బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్తున్నా.. దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే ఈ షోకి వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. మరి దువ్వాడ మాధురి హౌస్‌లో ఎలా ఉంటుంది? వైల్డ్ ఫైర్‌లా అగ్గి రాజేస్తుందా? అనేది చూడాలి!
చదవండి: పవన్‌ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా