
బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఐదోవారం నామినేషన్స్ పూర్తవగానే ఎలిమినేట్ అయ్యేదెవరనేది ఫిక్స్ అయిపోయింది. కానీ రీతూ, ఫ్లోరా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేశాడు నాగ్. హౌస్‌లో ఉంచినా సరే, పంపించినా సరే అన్నట్లుగా ఫ్లోరా చాలా కూల్‌గా ఉంది. కానీ, రీతూ మాత్రం ఏడుపందుకుంది. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్‌కు పిలిచిన నాగ్.. చివరిసారి మీ మనసులోని మాటలు చెప్పమన్నాడు.
ఆ విషయం సంజనాకు మాత్రమే తెలుసు
అప్పుడు ఫ్లోరా (Flora Saini) మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నేను నా బెడ్‌పై చాలాసార్లు ఏడ్చాను. ఆ విషయం సంజనా ఒక్కరికే తెలుసు. తను మాత్రమే నా దగ్గరకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా సంజనా ఒక్కరే వచ్చింది. సంజనాను నేను మిస్ అవుతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ గేమ్ ఎంజాయ్ చేయ్ అంటూ కాస్త ఎమోషనలైంది. రీతూ వంతు రాగా ఏడుస్తూనే మాట్లాడింది.

వెళ్లి పవన్‌ను హగ్ చేసుకో..
పవన్, నిన్ను చాలా మిస్ అవుతా.. నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. బాగా ఆడు.. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏకధాటిగా ఏడ్చేసింది. తర్వాత నాగ్.. ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అప్పటికీ రీతూ ఏడుపు ఆపకపోయేసరికి ఫ్లోరా.. నువ్వు సేఫ్ అయ్యావ్, ఎందుకేడుస్తున్నావ్.. హ్యాపీగా వెళ్లు, పవన్‌ను హగ్ చేసుకో అని చెప్పింది. సంజన, ఇమ్మాన్యుయేల్, దివ్య, శ్రీజలకు థంబ్స్ అప్ ఇచ్చి తనూజ, భరణికి థంబ్స్ డౌన్ సింబల్ ఇచ్చింది. సుమన్ శెట్టి.. థంబ్స్ అప్, థంబ్స్ డౌన్‌కు మధ్యలో ఉన్నాడంది. అందరికీ గుడ్‌బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.