
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్‌మేట్స్‌కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్‌లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.
కెప్టెన్‌తో గొడవ
కిచెన్‌లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు.

ఎవర్నీ లెక్క చేయని మాధురి
నేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్‌నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది.
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?
అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్‌పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్‌లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది.
చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా