
ఫిలింఫేర్ అవార్డుల్లో (Filmfare Awards 2025) లాపతా లేడీస్ సినిమా విజయ ప్రభంజనం మోగించింది. ఏకంగా 13 విభాగాల్లో పురస్కారాలు ఎగరేసుకుపోయింది. ఎక్కువ ఫిలింఫేర్లు అందుకున్న సినిమాగా ఇప్పటివరకు గల్లీ బాయ్ పేరిట (13 పురస్కారాలతో) రికార్డు ఉంది. ఇప్పుడు లాపతా లేడీస్ (Laapataa Ladies Movie) ఆ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్‌లో శనివారం జరిగిన 70వ ఫిలింఫేర్ వేడుకకు షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ యాంకర్స్‌గా వ్యవహరించారు.
'ఐ వాంట్ టు టాక్' మూవీకి గానూ అభిషేక్ బచ్చన్, 'చందు: ఛాంపియన్' సినిమాకుగానూ కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. లాపతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు అందించారు.
అవార్డు విజేతలు వీళ్లే..
ఉత్తమ దర్శకుడు: కిరణ్ రావు (లాపతా లేడీస్)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): ఐ వాంట్ టు టాక్ (డైరెక్టర్ సుజిత్ సర్కార్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): రాజ్‌కుమార్ రావ్ (శ్రీకాంత్ మూవీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్): ప్రతిభ (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయ నటి: ఛాయా కదమ్ (లాపతా లేడీస్)
ఉత్తమ డెబ్యూ నటుడు: లక్ష్య (కిల్)
ఉత్తమ డెబ్యూ నటి: నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: కునాల్ కెమ్ము (మడగావ్ ఎక్స్‌ప్రెస్), ఆదిత్య సుహాస్ జంబలే (ఆర్టికల్ 370)
ఉత్తమ యాక్షన్: సీయాంగ్ ఓ, పర్వేజ్ షైఖ్ (కిల్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)
ఉత్తమ కథ: ఆదిత్య ధర్, మోనాల్ టక్కర్ (ఆర్టికల్ 370)
ఉత్తమ సంభాషణలు: స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: రామ్ సంపత్ (లాపతా లేడీస్)
ఉత్తమ లిరిక్స్: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)
ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (లాపతా లేడీస్)
ఉత్తమ గాయని: మధుబంతి బగ్చి (స్త్రీ 2)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: రితేశ్ షా, తుషార్ షీతల్ జైన్ (ఐ వాంట్ టు టాక్)
ఉత్తమ సౌండ్ డిజైన్: సుభాష్ సాహో (కిల్)
ఉత్తమ నేపథ్య సంగీతం: రామ్ సంపత్ (లాపతా లేడీస్)
ఉత్తమ వీఎఫ్‌ఎక్స్: రీడిఫైన్(ముంజ్యా)
ఉత్తమ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (బ్యాడ్ న్యూస్ మూవీలో తాబ తాబ పాట)
ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పానికర్ (కిల్)
ఉత్తమ కాస్ట్యూమ్: దర్శన్ జలన్ (లాపతా లేడీస్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ (కిల్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రఫీ మహ్మద్ (కిల్)
ప్రత్యేక అవార్డులు
జీవిత సాఫల్య పురస్కరం: శ్యామ్ బెనగల్ (మరణానంతరం), జీనత్ అమన్
ఆర్‌డీ బర్మన్ పురస్కారం: అచింత్ టక్కర్ (జిగ్రా, మిస్టర్ అండ్ మిసెస్ మహి)
చదవండి: నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్‌ట్రాక్ ఫేక్!