
బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ఐదోవారం ఎలిమినేషన్ పూర్తయింది. జనాల ఓటింగ్స్ తక్కువ రావడంతో ఫ్లోరా ఎలిమినేట్ అయింది. స్వయంకృతపరాధం + వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వల్ల శ్రీజ (Srija Dammu) ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత వీరిద్దరూ నటుడు శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎంత టార్చర్ చేస్తే..
ఈ సందర్భంగా శివాజీ.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నది మనసులో బలంగా పెట్టుకున్నావని, నీకు అదే పెద్ద మైనస్ అయిందని శ్రీజకు చెప్పాడు. ఇక శ్రీజ.. ఒక మనిషిని నువ్వు నెగెటివ్.. నెగెటివ్.. నువ్వు ఎవరికీ సెట్ కావు, నీతో మాట్లాడకూడదు అంటే ఆటోమేటిక్‌గా ఎక్కడో డౌన్ అవుతాం. పైగా నేను కొందరి దగ్గర కూర్చుంటే వాళ్లు అక్కడుండేవారు కాదు, వెళ్లిపోయేవారు అని తెలిపింది. అందుకు శివాజీ.. హౌస్‌మేట్స్ నిన్ను చూసి పారిపోతున్నారంటే ఆ రెండువారాలు ఎంత టార్చర్ చేసుంటావు? అని కౌంటరిచ్చాడు.
కంటెంట్ కోసం లవ్ ట్రాక్
డిమాన్ పవన్ (Demon Pawan) గురించి చెప్తూ.. 'నేను వెళ్తే లవ్ యాంగిల్ ఏదైనా ట్రై చేయొచ్చు, నాకు లవ్ యాంగిల్ వేయొచ్చేమో.. అని డిమాన్ బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నాతో అన్నాడు. కంటెంట్ కోసం అలా చేస్తున్నాడు!' అంటూ పవన్-రీతూల లవ్ యాంగిల్ ఫేక్ అని బయటపెట్టింది. నిజానికి హౌస్‌లో డిమాన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడతాడు. కానీ రీతూతో లవ్ ట్రాక్ వల్ల తనపై అనవసరమైన నెగెటివిటీ వస్తోంది. తను ఎంత కష్టపడ్డా సరే అది హైలైట్ కాకుండా పోతోంది. పవన్‌కు ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్ అయిన శ్రీజ.. అతడిది ప్రీప్లాన్‌డ్ లవ్ ట్రాక్ అని బయటపెట్టింది.
చదవండి: 'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో