
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్‌బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్‌బాస్‌ల హోస్ట్‌లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు.
ప్రదీప్ చాలా డేంజర్
పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి!
చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి